వృద్ధుల హక్కులను కాపాడటం మన బాధ్యత
- అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవంలో ఎస్‌ఐ బి. గణేష్
నరసన్నపేట అక్టోబర్ 1 మేజర్ న్యూస్: భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మేరా యువ భారత్ కార్యక్రమంలో భాగంగా నరసన్నపేట తపోవన వృద్ధాశ్రమంలో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన నరసన్నపేట పోలీస్ ఎస్‌ఐ బి. గణేష్ మాట్లాడుతూ వృద్ధుల హక్కులను కాపాడటం, సమాజానికి వారు అందించిన సేవలను గుర్తించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. వృద్ధుల ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించడంతో పాటు వారిని గౌరవించాలని సూచించారు.
వృద్ధుల్లో ఒంటరితనాన్ని నివారించేందుకు కుటుంబ సభ్యులు, సమాజం ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. వారికి మెరుగైన వైద్య సేవలు, సామాజిక భద్రత కల్పించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు.
కార్యక్రమంలో మేరా యువ భారత్ వాలంటీర్లు దుర్రు కళ్యాణి కుమారి, గొండు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.