జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి -యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోళ్ళ పవన్ కుమార్
నూజివీడు, మేజర్ న్యూస్ : ఓటర్ల జాబితా.. ఎన్నికల ప్రక్రియలో జరుగుతున్న అవకతవలకు ప్రధాన బాధ్యత వహించి ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు గోళ్ళ పవన్ కుమార్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన నూజివీడులో విలేకరులతో మాట్లాడుతూ కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికలలో ఓడిపోతామనే భయం పట్టుకుందని విమర్శించారు. సర్ పేరుతో ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. 2024 ఎన్నికల్లో 400 సీట్లు గెలుస్తామని ప్రచారం చేసినప్పటికీ, చివరికి లోక్‌సభలో బీజేపీ 240 సీట్లకే పరిమితమైంది. వీటిలో 79 లోక్‌సభ స్థానాలను ఎన్నికల అక్రమాల ద్వారా గెలుచుకున్నారని ఆరోపణలు ఉన్నాయని గుర్తు చేశారు.అంతేకాకుండా, ఎన్నికల సంఘం సహకారంతో ఎన్నికల ప్రక్రియను తారుమారు చేయడం ద్వారానే మోదీ అధికారంలోకి వచ్చారని పవన్ కుమార్ ఆరోపించారు.ఇప్పుడు, 2029 ఎన్నికల్లో గెలవలేమని భావించి, ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ద్వారా ఓటర్ల పేర్లను తొలగించడానికి మరియు మరిన్ని ఎన్నికల అక్రమాలకు పాల్పడటానికి వారు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
ప్రసాద్ నూజివీడు