BREAKING
ఘనంగా ప్రారంభమైన జాతర మహోత్సవం -పోలేరమ్మ జాతరతో పులకించిన వెంకటగిరి -జాతరకు రాష్ట్ర పండుగా హోద... 50 లక్షలు మంజూరు -ప్రభుత్వ లాంఛనాలతో అమ్మవారికి పట్టు వస్త్రాలు -పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి - అమ్మవారి దర్శనం కోసం పోటెత్తిన భక్తజనం - జై పోలేరమ్మ తల్లి నినాదాలతో మారి మ డ్వాక్రా గ్రూప్ ప్రెసిడెంట్ 13 లక్షల అవినీతి స్కాం బాక్సాఫీస్ వద్ద అద్భుతం సృష్టించేందుకు సిద్ధమైన ఫహాద్ ఫాజిల్ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’.. భారీ అంచనాలు ఈనెల 4న జూనియర్ ఖో-ఖో జట్ల ఎంపికలు బాలయోగి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు.. హైదరాబాద్‌ ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. రేపు ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం భట్టి అనుమానాస్పదంగా బావిలో పడి వ్యక్తి మృతి అంగన్‌వాడీ కేంద్రాల్లోనే చిన్నారుల సమగ్ర వికాసం కుకూన్స్ సినిమా పోస్టర్‌ను విడుదల చేసిన ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి జర్నలిస్టుల హక్కుల కోసం అక్టోబర్ 2న నిరసన గ్రీన్ ఫీల్డ్ హైవే పై లారీ బోల్తా పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలిలేకుంటే ఉద్యమాలు తప్పవు: సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజారామ్మోహన్‌రాయ్ రామయ్య కథ సుఖాంతం.. నెల్లిమర్ల పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఎస్పీ * సిబ్బందితో ప్రత్యేక సమీక్ష! డైరెక్టర్ రంజిత్ భాషకు అభినందనలు తిరుపతి ఎడ్యుకేషన్ మేజర్ న్యూస్ జీవో నెంబర్ 24 ఎయిడెడ్ అబ్జర్వ్ డ్ ప్రభుత్వం సర్వీస్ రూల్ రావడానికి సహకరించిన ఇంటర్మీడియట్ డైరెక్టర్ రంజిత్ భాషకు నాన్ టీచింగ్ అసోసియేషన్ నేతలు అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు ఆయనను వారి కార్యాలయంలో చిత్తూరు జిల్లా నాన్ టీచింగ్ అసోసి

మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట

Select Suryaa Now
మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట

 

ఐదు ప్రధాన రహదారి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గొండు శంకర్

గార అక్టోబర్ 1 మేజర్ న్యూస్: గ్రామీణ ప్రాంతాల్లో రవాణా వ్యవస్థను మెరుగుపరిచే లక్ష్యంతో నియోజకవర్గంలో రహదారి అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. ఇందులో భాగంగా గురువారం గార, రూరల్ మండలాల పరిధిలో ఐదు ప్రధాన రహదారి నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలో రెండు మండలాలు మాత్రమే ఉన్నప్పటికీ రహదారి అభివృద్ధి కోసం రికార్డు స్థాయిలో రూ.12.72 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. జిల్లాలోనే అత్యధికంగా నిధులు సాధించామని పేర్కొన్నారు. తొలి విడతలో రూ.3.63 కోట్ల అంచనా వ్యయంతో ఐదు రహదారి పనులను ప్రారంభించినట్లు చెప్పారు.

ఇందులో రూ.80 లక్షలతో శ్రీకూర్మం నుంచి ఎస్.మచ్చలేశం వరకు, రూ.65 లక్షలతో శ్రీకూర్మం జెడ్‌పీ రోడ్డు నుంచి దువ్వపేట వరకు, రూ.73 లక్షలతో సి.ఎస్.పీ. రహదారి నుంచి కొత్తూరు సైరిగాం వరకు రహదారి నిర్మాణ పనులు చేపట్టనున్నారు. అలాగే రూ.కోటి వ్యయంతో దీపావళి ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి రాళ్లపేట వరకు, రూ.48 లక్షలతో సి.ఎస్.పీ. రహదారి నుంచి బావాజీపేట వరకు రహదారి పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు.

గత పాలకుల మాదిరిగా మాటలకే పరిమితం కాకుండా నిధులు మంజూరు చేయించి, పనులను క్షేత్రస్థాయిలో ప్రారంభించిన తర్వాతే ప్రజల ముందుకు వస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రహదారి పనులు పూర్తయితే ఆయా ప్రాంతాల ప్రజల రవాణా సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు. రాబోయే రోజుల్లో ఇళ్ల పట్టాలు, ఇతర మౌలిక వసతుల కల్పనకు కూడా ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.

కార్యక్రమంలో గార, రూరల్ మండలాల నాయకులు, శ్రీకూర్మం, కొత్తూరు సైరిగాం, దీపావళి, రాగోలు గ్రామాల నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.