BREAKING
రాయికల్ అయ్యప్ప ఆలయం లో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు 6, 7 వార్డుల్లో సర్పంచ్ అభ్యర్థి పుష్పావతి ముమ్మర ప్రచారం 2010 నుంచి యూరోపియన్ యూనియన్ చట్టాలు రెట్టింపు కంటే ఎక్కువ కలగోడులో కాలవ వసంతమ్మకు మద్దతుగా భారీ ర్యాలీ గుమ్మగట్ట మేజర్ న్యూస్: కలగోడు!! ప్రైవేట్ రంగం జోరుతో పదేళ్లలోపే 40 నుంచి 45 బిలియన్ డాలర్లకు భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ వెంగళమ్మ చెరువు పంచాయతీ సర్పంచ్ ఏకగ్రీవం ప్రాధాన్య కెరీర్ మార్గంగా తీర్చిదిద్దడంపై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి మంచం గుర్తుకు ఓటేయండి.. గ్రామాన్ని అభివృద్ధి చేస్తా!** నగర పాలక సంస్థలోని విభాగాలను సందర్శించిన నగర మేయర్ లక్ష్మి అపర్ణ కోవెలమూడి వైసిపి కౌన్సిలర్ల పై అధికారులు పక్షపాతం వెంకన్న నిత్య అన్నదాన పథకానికి విరాళాలు విలువ కార్తీక పౌర్ణమి వేళ నృసింహ క్షేత్రానికి భక్తజనసంద్రం - 9వ గిరి ప్రదక్షిణకు పోటెత్తిన భక్తులు పకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన యువత క్రీడాల్లో రాణించాలి చిట్టమూరు సర్పంచ్‌గా గణపర్తి సుశీలమ్మ ఏకగ్రీవం గ్రామ ప్రజల ఏకాభిప్రాయం.. 10 వార్డులూ ఏకగ్రీవం ఉప సర్పంచ్‌గా పఠాన్ బషీర్ ఖాన్ గ్రామాభివృద్ధే లక్ష్యం: గణపర్తి కిషోర్ నాయుడు

డ్వాక్రా గ్రూప్ ప్రెసిడెంట్ 13 లక్షల అవినీతి స్కాం

Select Suryaa Now
డ్వాక్రా గ్రూప్ ప్రెసిడెంట్ 13 లక్షల అవినీతి స్కాం

      స్కాము కు సహకరించిన డ్వాక్రా యానిమేటర్ మరియు బ్యాంక్ మేనేజర్ అండ్ సభ్యులు ఆరోపణ

రావులపాలెం మేజర్ న్యూస్ :ప్రతినెల పొదుపుతో పాటు తీసుకున్న లోన్ సొమ్ము డ్వాక్రా గ్రూప్ సభ్యులు క్రమం తప్పకుండా ప్రతి నెల వాయిదా  సొమ్ము చెల్లిస్తుండ గా ఇదే ఆధునుగా  భావించిన ఆ గ్రూప్ ప్రెసిడెంట్ మరియు అంగన్వాడి టీచర్ అయిన కొల్లపు సూర్యకళ అను ఆమె 32 నెలలుగా ఆ సొమ్మును బ్యాంకుకు జమ చేయకుండా స్వాహా చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

 వివరాలు ప్రకారం మండల పరిధి లోని పొడగట్లపల్లి గ్రామానికి చెందిన అశోక గ్రూప్ సభ్యులు   పదిమంది గ్రూపుగా ఏర్పడి గోపాలపురం గ్రామంలో గల ఇండియన్ బ్యాంక్ నందు అకౌంట్ తెరిచి అందు పొదుపు చేయడమే కాకుండా ఆ బ్యాంకు నుండి రుణమును కూడా పొందియున్నారు. ఆ ఋణం నిమిత్తం ప్రతి నెల రు 6100  చొప్పున  బ్యాంకుకు వాయిదా చెల్లించవలసి ఉన్నది. సాధారణంగా గ్రూపు ప్రెసిడెంట్ సెక్రటరీ సొమ్మును కలెక్ట్ చేసి ఎవరో ఒకరు ద్వారానే బ్యాంకు నందు జమ చేస్తారు.

 కానీ ఇక్కడ ఆ విధంగా కాకుండా ఆ గ్రూపు ప్రెసిడెంట్ సూర్య కళ అను ఆమె గ్రూపు సభ్యులు వద్దనుండి ప్రతినెలా వాయిదా సొమ్మును స్వీకరించి  ఆ సొమ్మును గత 39 నెలలుగా లోన్ నిమిత్తం బ్యాంకు నందు జమ చేయలేదు. ఇక్కడ విషయం ఏంటంటే లోను సొమ్ము చెల్లించడం లేదని బ్యాంక్ మేనేజర్ గాని గ్రూపులపై వ్యవహార లావాదేవీలు చేసే యానిమేటర్ గాని ఏనాడూ కూడా గ్రూపు సభ్యులు దృష్టికి తీసుకెళ్లిన సంఘటనలు లేవు . ఇక్కడే పలు అనుమానాలకు దారి తీస్తుంది. గ్రూపు సభ్యులు లోన్ తీసుకుని 32 నెలలు గడుస్తున్నప్పటికిని రుణం ఎందుకు చెల్లించడం లేదని మేనేజర్ కి తెలియదా అనేది ప్రశ్నార్థకం ? అదే సమయంలో యానిమేటర్ కు తెలియని విషయంగా ఉందా అంటే అది కూడా ప్రశ్నార్థకం? ఇక్కడ గ్రూపు ప్రెసిడెంట్ మరియు అంగన్వాడీ టీచర్ అయినా  సూర్యకళ అను ఆమె యానిమేటర్ కొల్లపు మంగ ఇరువురు బంధువులు  కావడంతో ఈ స్కామ్ ఇద్దరికీ తెలిసే జరిగిందా ? వీరిద్దరూ బ్యాంకు వారిని మభ్యపెట్టి మసిపూసి మారేడు కాయ చేసే విధంగా ప్రణాళికను రూపొందించారా  అనేది సందేహం. 

చివరికి గ్రూప్ సభ్యులు కు కొన్ని అనుమాన ఘటనలు ఆ నోట ఈ నోట వినబడడంతో బ్యాంకు వారిని సంప్రదించగా గత 39 నెలలుగా లోను చెల్లించడం లేదు అనేది విషయం తెలిసింది. ఈ సంఘటన పై ప్రెసిడెంట్ ను నిలదీయగా రెండు నెలల్లో మొత్తం సొమ్ము తిరిగి చెల్లిస్తామని కుటుంబ సభ్యులు బాండ్ పై హామీ రాసిచ్చినట్లు తెలుస్తుంది. కానీ అ హామీ నెరవేరకపోవడంతో రావులపాలెం డ్వాక్రా మహిళా సమైక్య ఆఫీస్ కి గ్రూప్ సభ్యులు చేరుకుని ఏ పి ఎం కు ఫిర్యాదు చేసినట్లు గ్రూప్ సభ్యులు తెలిపారు.

 ఏది ఏమైనప్పటికిని రూపాయి రూపాయి పోగు చేసుకుని కూలి నాలి చేసుకుంటూ చిరు వ్యాపారాలు చేసుకుంటూ కూడబెట్టిన సొమ్మును అక్రమ పద్ధతుల్లో దోచేయడం అనేది ఇటీవల కాలంలో డ్వాక్రా సంఘాల్లో పరిపాటిగా మారింది. దీనికి కారణం చేసిన వ్యక్తులపై సరైన చర్యలు చేపట్టక పోవడమే అలుసుగా భావిస్తూ ఇష్టానుసారంగా దోపిడీకి పాల్పడుతున్నారు అనేది స్పష్టం అవుతుంది.

 39 నెలలుగా  లోన్ ఇచ్చిన సొమ్ముకు వాయిదాలు చెల్లించడం లేదు అని తెలిసి కూడా బ్యాంక్ మేనేజర్ సిబ్బంది ఎందుకు స్పందించలేదు అనేది ఇక్కడ పలు అనుమానాలు తావిస్తుంది అదే సమయంలోబ్యాంకు వారి కి తెలియని విషయమా అంటే తెలిసే జరిగింది అనేది సుస్పష్టం. తక్షణమే ఆయా శాఖ వారు విచారణ చేపట్టి స్కాముకు పాల్పడిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని సభ్యులు కోరుకుంటున్నారు. అంతేకాకుండా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే వీరిపై కేసు నమోదు చేసి వారిని ఉద్యోగాల నుండి తొలగించి  ఆస్తులు జప్తూ చేయాలని గ్రూప్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు