కుకూన్స్ సినిమా పోస్టర్‌ను విడుదల చేసిన ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: తెలుగు చిత్ర పరిశ్రమలో వైవిధ్యమైన సినిమాలతో విజయాలను అందుకుంటున్న స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తాజాగా మరో సరికొత్త చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. జగన్ జోగిరాజ్, సాగర్ కిరణ్, వికాస్ చైతన్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం కుకూన్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సినిమా పోస్టర్‌ను పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్న దర్శకుడు అనిల్ రావిపూడి స్వయంగా విడుదల చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా పోస్టర్ చాలా వినూత్నంగా, ఆకట్టుకునేలా ఉందని అనిల్ రావిపూడి ప్రశంసించారు. దర్శకుడు మహేష్ గౌరి ఈ సినిమాను చాలా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిస్తున్నారని, ఆయన ఆలోచన విధానం ఈ పోస్టర్ ద్వారా స్పష్టంగా తెలుస్తోందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న వికాస్ చైతన్య గతంలో టెలివిజన్ రంగంలో మెంటార్‌గా వ్యవహరించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారని, ఇప్పుడు ఈ సినిమాతో నటుడిగా ప్రేక్షకుల ముందుకు వస్తుండటం సంతోషకరమని ఆయన అన్నారు.
న్యూ వేవ్ పిక్చర్స్ మరియు ఎం.ఆర్ట్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సుఖేష్ పొట్ల, మమత రెడ్డి కాసం, మహేష్ గౌరి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేష్ గౌరి దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ అందరినీ అలరించేలా అన్ని హంగులతో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడించనున్నట్లు చిత్ర యూనిట్ స్పష్టం చేసింది.