అప్స డెమొక్రటిక్ డివిజన్ అధ్యక్షురాలుగా పోలిశెట్టి కనకదుర్గ భవాని
ముదినేపల్లి , మేజర్ న్యూస్ : మండలంలోని కొత్తపల్లి ప్రగతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ (అప్స) డెమొక్రటిక్ కైకలూరు డివిజన్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నూతన పాలకవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు అప్స డెమొక్రటిక్ జిల్లా గౌరవ అధ్యక్షులు చెన్నంశెట్టి కృష్ణ తెలిపారు. కైకలూరు డివిజన్ అధ్యక్షురాలుగా పోలిశెట్టి కనకదుర్గభవాని , ప్రధాన కార్యదర్శిగా మట్టతిల్ జార్జి , కోశాధికారిగా రుద్రపాక సాగర్ శర్మ , ఉపాధ్యక్షులుగాపి. జయ కిషోర్ బాబు, సంయుక్త కార్యదర్శిగాటీవీ నారాయణ,ఎగ్జిక్యూటివ్ నంబర్లు గాడి ఎల్ నారాయణ, కర్రే మహంతి ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లుతెలిపారు.అనంతరం ఈ కార్యక్రమంలో 2026 - 27 కు సంబంధించి స్పెల్లింగ్ బి, పోటీలు ఆటలు పోటీలనిర్వహణపై చర్చించారు.కైకలూరు నియోజకవర్గం లోని ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ (అప్స)డెమొక్రటిక్ సభ్యులు పాఠశాలల పి ఈ టి లు పాల్గొన్నారు.
నాగరాజు ముదినేపల్లి