BREAKING
గాంధీజీకి విఘ్నేశ్వర, అధికారులు నివాళులు ఔత్సాహిక క్రీడాకారులను ప్రోత్సహిస్తాం : పద్మారావు గౌడ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు బీజేపీ సమర సన్నద్ధం ఎస్.భూర్జవలస హెచ్ఎం కెవి సత్తిబాబుకు స్వచ్ఛత అవార్డు ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం (పి పి ఎల్)జిల్లా అధ్యక్షుడిగా ఉప్పలయ్య* విజయ కాలనీ అంగన్వాడీ కేంద్రానికి స్వచ్ఛ్ ఆంధ్ర అవార్డు చుండూరి నీ స్థాయేంటే....? జాతిపిత గాంధీజీ జయంతి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు విద్యాసంస్థలు వైద్యాలయాలలో చేయరా ? కంచనపల్లి కాంగ్రెస్ గ్రామ శాఖ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక రామచంద్రపురం సబ్ జైలు తనిఖీ స్వచ్ఛ ఆంధ్రలో కమలాపురం ఆసుపత్రికి ప్రథమ స్థానం డాక్టర్ ఆమంచి శిరీషకు - కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు.. నడకతోనే సంపూర్ణ ఆరోగ్యం… ఎమ్మెల్యే బొలిశెట్టి హార్టికల్చర్ హబ్ ద్వారా రైతులు కు ఎంతో ఉపయోగకరం శిథిలావస్థకు చేరిన సిసి రోడ్లు స్థానిక ఎన్నికల్లో నూరుశాతం కూటమి గెలవాలి

గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ముందుండి నడిపిస్తా

Select Suryaa Now
గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ముందుండి నడిపిస్తా

 

- ఎమ్మెల్యే గొండు శంకర్

గార అక్టోబర్ 1 మేజర్ న్యూస్ : గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్తామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. గార మండలంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించిన ‘పేదల సేవలో గ్రామసభ’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయించిందని, వాలంటీర్ల వ్యవస్థ పేరుతో ప్రజలను మోసం చేసిందని ఆయన విమర్శించారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం లబ్ధిదారులకు నేరుగా ఇంటి వద్దకే పింఛన్లు అందిస్తున్నామని తెలిపారు. వృద్ధులకు రూ.4,000, దివ్యాంగులకు రూ.6,000, కిడ్నీ బాధితులకు రూ.10,000, మంచానికే పరిమితమైన వారికి రూ.15,000 చొప్పున పెంచిన పింఛన్లను ప్రతినెలా ఒకటో తేదీనే సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేస్తున్నామని వివరించారు.

సంక్షేమంతో పాటు అభివృద్ధికి కూడా ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని శంకర్ పేర్కొన్నారు. శ్రీకూర్మం, ధూపేట, రాళ్లపేట తదితర ప్రాంతాల్లో రహదారి నిర్మాణాలకు కోట్లాది రూపాయల నిధులు మంజూరయ్యాయని, నిలిచిపోయిన పనులను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు.

తాను ఎమ్మెల్యే కాకముందే రామాలయ నిర్మాణానికి గ్రామ ప్రజల్లో ఉన్న భక్తిభావాన్ని గుర్తించి రూ.2.45 లక్షలు విరాళంగా అందించినట్లు ఎమ్మెల్యే గుర్తుచేశారు. గ్రామాల అభివృద్ధికి కూటమి నాయకులకు ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు.

గత ఐదేళ్లలో గ్రామాల పరిస్థితిని ప్రజలు గమనించారని, రాబోయే ఐదేళ్లలో తమకు చెందిన సర్పంచ్‌లకు అవకాశం కల్పిస్తే గ్రామాల అభివృద్ధితో పాటు ప్రజల కుటుంబాల అభివృద్ధికి కూడా కృషి చేస్తామని అన్నారు. ఎమ్మెల్యేగా తాను అభివృద్ధి కార్యక్రమాలను ముందుండి నడిపిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు.

కార్యక్రమంలో జిల్లా నోడల్ అధికారి, పరిశ్రమల శాఖ జీఎం శ్రీధర్, ఎంపీడీవో, ఎంఆర్వో, వివిధ శాఖల అధికారులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.