చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ను వెంటనే తొలగించాలి
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ను వెంటనే తొలగించాలి
-ఆధ్వర్యంలో కండ్లకు నల్ల గుడ్డలు కట్టి, నల్ల జెండాలతో నిరసన
గార్ల, 30 సెప్టెంబర్ సూర్య (మేజర్ న్యూస్)రాజ్యాంగ బద్ధమైన ఎన్నికల వ్యవస్థను దెబ్బతీస్తున్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ను తన బాధ్యతల నుంచి వెంటనే తొలగించాలని సిపియం ఆధ్వర్యంలో బుధవారం స్థానిక నెహ్రూ కూడలిలో నల్ల గుడ్డలు కళ్లకు కట్టుకొని, నల్ల జెండాలను చేత బూని భారీ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందునూరి శ్రీనివాసరావు,మండల కార్యదర్శి అలవాల సత్యవతి లు మాట్లాడుతూ.. ప్రభుత్వ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఏక పక్ష నిర్ణయాలు పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికే తీవ్ర ప్రమాదకరంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. మిగిలిన ఇద్దరు ఎన్నికల కమిషనర్ల సూచనలు పట్టించుకోకుండానే "సర్" పేరుతో దాదాపు 13 కోట్ల ఓట్లను తొలగించారని వారు మండిపడ్డారు.అధికార పక్షం ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్న ఎన్నికల సంఘం చూసి చూడనట్లు వ్యవహరిస్తోందని, విపక్షాల అభ్యంతరాలను పట్టించుకోవడంలేదని వారు విమర్శించారు.స్వతంత్రంగా వ్యవహరించాల్సిన రాజ్యాంగ సంస్థ అధికార పక్షానికి అనుకూలంగా పని చేస్తూ..తన విశ్వసనీయతను కోల్పోయిన, జ్ఞానేశ్ కుమార్ ను తక్షణమే తొలగిస్తే తప్ప ప్రజాస్వామ్యం మనుగడ సాగించలేదని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం క్రమంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాలు తదితరులు పాల్గొన్నారు.