BREAKING
ఒంగోలులో 150 అడుగుల జాతీయ జెండా ప్రదర్శన సచివాలయ ఉద్యోగులపై కూటమి ప్రభుత్వం దాష్టికం : మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఫైర్‌ క్రీడా పోటీల విజేతలను సత్కరించిన గీతం లయోలా డిగ్రీ కళాశాలలో ఘనంగా కళాశాల దినోత్సవం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా విలేకరుల సమావేశం ఒంటి కాలిపై గ్రామ సేవకుల నిరసన.. ప్రపంచ ఆహార భద్రత పై అంతర్జాతీయ సదస్సు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రారంభం... కాంగ్రెస్ కమిటీ జిల్లా అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ కి పార్నపల్లి విద్యార్థిని ఎంపిక మడనూరు గ్రామంలో “పల్లె పండుగ 3.0” పల్లె పండుగకు భారీగా తరలిన ప్రజలు,. జెండా ఊపి బస్సులను ప్రారంభించిన ఎంపి,ఎమ్మెల్యేలు 1 టౌన్‌లో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి {CMRF} సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ* ఉదయగిరి నియోజకవర్గం పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో--చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు కుటుంబాలను పరామర్శించిన పైలెట్ రోహిత్‌రెడ్డి విశ్రాంతికి భరోసా కావాలి.. పెన్షనర్ల మహాధర్నా

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి

Select Suryaa Now
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి

-- BSP వేములవాడ నియోజకవర్గ అధ్యక్షులు కట్కూరి శంకర్ డిమాండ్ సూర్య వేములవాడ 

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను మరిచిపోయిందని బహుజన్ సమాజ్ పార్టీ వేములవాడ నియోజకవర్గ అధ్యక్షులు కట్కూరి శంకర్ ఆరోపించారు. తక్షణమే ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం రుద్రంగి మండల కేంద్రంలో విలేకరుల కట్కూరి శంకర్ సమావేశంలో మాట్లాడుతూ బీసీ డిక్లరేషన్ అమలు తో పాటు
బీసీలకు ఇచ్చిన హామీలతోపాటు పెళ్లయిన మహిళలకు కల్యాణ లక్ష్మి కింద తులం బంగారం అందించాలన్నారు.
ఎస్టీలకు పోడు భూముల పట్టాలు అందించి వారికి హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. వితంతువులకు, వికలాంగులకు, వృద్ధులకు 6000 పింఛన్, బీడీ కార్మికులకు 4000 రూపాయలు, 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు 2500 పెన్షన్ వెంటనే అమలు చేయాలని అన్నారు. గత ఎన్నికలకు ముందు సూరమ్మ చెరువు ప్రాజెక్టును సందర్శించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డ 18 నెలలోపే సూరమ్మ చెరువు పూర్తి చేసి ఆయకట్టు రైతులకు నీళ్లు అందిస్తానని ఇచ్చిన హామీ నేటికి నెరవేరలేదు అన్నారు.
తెలంగాణ నిరుద్యోగ యువతకు రెండు లక్షల ఉద్యోగాల సంగతి ఏంటని ప్రశ్నించారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వకుండా సిరిసిల్లలో ఈనెల 30న బహిరంగ సభకు వచ్చి ఏం మాట్లాడతారని ప్రశ్నించారు.
ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను వెంటనే నెరవేర్చాలని లేనిపక్షంలో BSP ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శులు కట్కూరి రమేష్, మండల అధ్యక్షులు దయ్యాల ఉదయ్ నాయకులు పోసు తిరుపతి, ఎల్లయ్య, ఎనిగందుల సతీష్, లింగాల రవి, కట్కూరి అశోక్, గసికంటి అరుణ్ తదితరులు పాల్గొన్నారు.