బహదూర్ గూడ భూముల అంశంపై ఎమ్మెల్యే ప్రెస్ మీట్
- సాయంత్రం 4 గంటలకు మీడియాతో మాట్లాడనున్న రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్
- ప్రతిపక్షాల ఆరోపణలపై కీలక ప్రకటనకు అవకాశం.!
జీహెచ్ఎంసీ పరిధిలోని బహదూర్‌గూడ గ్రామంలోని భూముల వ్యవహారం గత కొద్ది రోజులుగా రాజకీయంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఈరోజు సాయంత్రం 4 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం.
బహదూర్‌గూడ భూముల వ్యవహారంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు, ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలపై ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ ఈ సమావేశంలో స్పందించే అవకాశం ఉన్నట్లు శంషాబాద్ కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి సమాచారం. భూములకు సంబంధించిన వివాదం, ఆరోపణలు, వాటిపై తన వైఖరిని వెల్లడించడంతో పాటు ఈ వ్యవహారంపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
గత కొద్ది రోజులుగా బహదూర్‌గూడ భూముల వ్యవహారంపై వివిధ రాజకీయ పార్టీల నేతలు పరస్పరం ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో ఎమ్మెల్యే నిర్వహించనున్న మీడియా సమావేశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
అయితే ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ మీడియా సమావేశంలో ఏ అంశాలను ప్రస్తావిస్తారు? భూముల వ్యవహారంపై ఎలాంటి వివరాలను వెల్లడిస్తారు? ప్రతిపక్షాల ఆరోపణలకు ఏ విధంగా సమాధానం ఇస్తారన్నది సమావేశం అనంతరం స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
- పోతుల నర్సింహా : మేజర్ స్యూస్, శంషాబాద్.