BREAKING
ఢిల్లీలో నిర్వహించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న రఘువీరారెడ్డి రేపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డియోగ క్షేమాలు అడిగి తెలుసుకున్న--ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి వచ్చే రెండు దశాబ్దాలు దేశ భవిష్యత్తుకు అత్యంత కీలకం: సీఎం చంద్రబాబు బహదూర్ గూడ భూముల అంశంపై ఎమ్మెల్యే ప్రెస్ మీట్ సైబర్ నేరాలు, POCSO, డ్రగ్స్‌ కౌన్సెలింగ్ పై NCC విద్యార్థులకు అవగాహన తిరుపతిలో ఘోర ప్రమాదం ముగ్గురు మృతి ఇద్దరు పరిస్థితి విషమం షేర్ మొహమ్మద్ పేట లో సర్పంచ్ ఎలక్షన్ హీట్ విజయవాడలో పేదలకు పట్టాభిషేకం మోడల్ సొసైటీగా అంబాజీపేట వరికుంటపాడు, రామాపురం చేరుకున్నపవన్ మీ ఇల్లు మీ హక్కుతో పేదలకు భారీ భరోసా గుండె జబ్బులు కేవలం వృద్ధుల్లోనే వస్తాయనే అపోహ వీడాలి: కిమ్స్ హాస్పిటల్స్ 30 తేదీ సీఎం సభను విజయవంతం చేయండి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కు సాదర వీడ్కోలు

ఎల్లంపేట్ బీజేపీ నేతలకు జిల్లా స్థాయిలో కీలక బాధ్యతలు

Select Suryaa Now
ఎల్లంపేట్ బీజేపీ నేతలకు జిల్లా స్థాయిలో కీలక బాధ్యతలు

మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలిగా మేకల రజిత దేవేందర్ రెడ్డి

మేడ్చల్, మేజర్ న్యూస్( సెప్టెంబర్ 28):
బీజేపీ మేడ్చల్ జిల్లా కమిటీలో ఎల్లంపేట్ మున్సిపాలిటీకి చెందిన పలువురు నాయకులు, కౌన్సిలర్లకు వివిధ జిల్లా స్థాయి బాధ్యతలు లభించాయి. ఈ నియామకాలతో ఎల్లంపేట్ మున్సిపాలిటీ బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.బీజేపీ మేడ్చల్ జిల్లా మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలిగా ఎల్లంపేట్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ మేకల రజిత దేవేందర్ రెడ్డి నియమితులయ్యారు. అలాగే కౌన్సిలర్ అర్చన శ్రీనివాస్ ముదిరాజును ‘మన్ కీ బాత్’ జిల్లా కన్వీనర్‌గా, శారద రాజు నాయక్ను కో-కన్వీనర్‌గా, మహేశ్వరి రాజేష్ను జిల్లా కార్యవర్గ సభ్యురాలిగా నియమించారు. పుష్ప మల్లారెడ్డికి ఎల్లంపేట్ మున్సిపాలిటీ మహిళా మోర్చా అధ్యక్షురాలి బాధ్యతలు అప్పగించారు.ఈ సందర్భంగా బీజేపీ మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షులు, ఎల్లంపేట్ గౌరారం మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ సభ్యులు జగన్ గౌడ్, మున్సిపాలిటీ అధ్యక్షుడు శ్రీశైలం యాదవ్ తదితరులు నూతనంగా బాధ్యతలు చేపట్టిన నాయకులను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ బీజేపీ బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అందుబాటులో ఉంటూ పార్టీ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో మరింత విస్తరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జీఎస్ కంచు గంట మహేశ్, రాజేష్, రవి నాయక్, లక్ష్మణ్, రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.రిపోర్టర్ తలారి శివకుమార్.