భగత్ సింగ్ జీవితం స్ఫూర్తిదాయకం
సూర్యా రంగరెడ్డి బ్యూరో : స్వతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ త్యాగస్ఫూర్తి నేటి యువతకు ఆదర్శమని చేవెళ్ల మున్సిపల్ కౌన్సిలర్ అత్తెల్లి మనీషా అనంత్ రెడ్డి అన్నారు. భగత్ సింగ్ జయంతి సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో చేవెళ్లలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మనీషా అనంత్ రెడ్డి మాట్లాడుతూ... భగత్ సింగ్ చిన్న వయసులోనే దేశ స్వాతంత్ర్యం కోసం ధైర్యంగా పోరాడి, తన ప్రాణాలను దేశం కోసం అర్పించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన పోరాటం, చూపిన ధైర్యం, దేశం పట్ల ఉన్న అంకితభావం, త్యాగం ఎప్పటికీ మరువలేనివని కొనియాడారు. భగత్ సింగ్ తన జీవితాన్ని దేశం కోసం అంకితం చేసి యువతలో దేశభక్తి, త్యాగం, ధైర్యం వంటి స్ఫూర్తిని నింపారని తెలిపారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల చరిత్రను నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భగత్ సింగ్ ఆశయాలు, దేశభక్తి స్ఫూర్తిని యువత ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. దేశ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల బీజేపీ మున్సిపల్ అధ్యక్షుడు అత్తెల్లి అనంత్ రెడ్డి, బీజేపీ నాయకులు పాగా వెంకటేష్, చాకలి శ్రీనివాస్, భార్గవ్ రెడ్డి, తెలుగు శ్రీనివాస్, గణేష్, దామోదర్, శివ, హర్షిత్ తదితరులు ఉన్నారు.
- సున్నపు ప్రవీణ్ : మేజర్ న్యూస్, చేవెళ్ల.