BREAKING
*భగత్‌సింగ్ ఆశయాలే విద్యార్థి ఉద్యమాలకు స్ఫూర్తి దళితులకు స్మశాన వాటిక కేటాయించాలి గోదావరి పుష్కరాల పనులు వేగవంతం చేయాలి ఘాట్లు, గౌతమేశ్వర ఆలయ పనులు త్వరగా ప్రారంభించాలి: కలెక్టర్‌ కోయ శ్రీహర్ష రాయించెరువులో సాగునీరు నింపాలి - బీజేపీ నేతల డిమాండ్. SIRపై కాంగ్రెస్ సమరం.. ఈసీకి వ్యతిరేకంగా పెద్దపల్లిలో ధర్నా 3 రోజుల్లో నాని ‘ది ప్యారడైజ్’ వరల్డ్‌వైడ్ కలెక్షన్ల సునామీ పురట్చి తలైవర్ పేరుతో దిగ్గజ నటుడు ఎంజీఆర్ బయోపిక్.. కీలక పాత్రలో జేఎం బషీర్! సమస్యలపై వైఎస్ఆర్సిపి శ్రేణులు వినతి పత్రం థియేటర్లలోకి వచ్చిన 20 రోజులకే ఓటీటీలోకి కార్తి సర్దార్ 2.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే! భగత్ సింగ్ నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలి పిహెచ్ సి లో స్పెషలిస్ట్ డాక్టర్ ను నియమించండి.... రామాపురానికి సీఎం చంద్రబాబు. ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి పుష్పాల వైభవంగా గరుడవాహనం బంగాళాఖాతంలో మరో వాయుగుండం

2029 ఎన్నికల్లోగా మంగళగిరిలో ప్రతి గడపకు తాగునీటి కనెక్షన్!

Select Suryaa Now
2029 ఎన్నికల్లోగా మంగళగిరిలో ప్రతి గడపకు తాగునీటి కనెక్షన్!

*భూగర్భ డ్రైనేజి, అండర్ గ్రౌండ్ గ్యాస్ కనెక్షన్ కూడా పూర్తి చేస్తాం*

*వచ్చే ఏడాది వంద పడకల ఆసుపత్రి ప్రారంభిస్తాం*

*మంగళగిరి నుంచే ప్రభుత్వ పాఠశాలల్లో సీట్ల కోసం పోటీ మొదలైంది*

*స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి*

*మూడో విడత పట్టాల పంపిణీలో మంత్రి నారా లోకేష్*

*మన ఇల్లు – మన లోకేష్ కార్యక్రమంలో 372మందికి శాశ్వత పట్టాలు*

 సూర్య, స్టేట్ బ్యూరో : 

 మంగళగిరిలో 2029 ఎన్నికల లోపు ప్రతి గడపకి తాగునీటి కనెక్షన్, అండర్ గ్రౌండ్ గ్యాస్ కనెక్షన్, భూగర్భ డ్రైనేజి పూర్తిచేసే బాధ్యత నేను తీసుకుంటా, ఆనాడు ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నానని  విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. తాడేపల్లి మండలం కుంచనపల్లి శ్రీశ్రీనివాస కన్వెన్షన్స్ లో మన ఇల్లు – మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా మంత్రి లోకేష్ చేతుల మీదుగా 372మందికి శాశ్వత పట్టాలు, పిఎంఎవై మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... మంగళగిరిలో 100 పడకల ఆసుపత్రి ఇక్కడ ప్రజల దశాబ్ధాల కల. ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవ్వరూ ఊహించని రీతిలో రాష్ట్రంలోనే తొలిసారిగా ఆసుపత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. వచ్చే సంవత్సరం మొదటి మూడు నెలల్లో ఆసుపత్రి పనులు పూర్తి చేసి ప్రజలకి అంకితం చేసే బాధ్యత మేం తీసుకుంటాం. మహానాడు కట్టకి రిటైనింగ్ వాల్, భూగర్భ డ్రైనేజి, తాగునీటి సమస్యకు శాశ్వతమైన పరిష్కారం కావాలని ఎన్నికల సమయంలో అడిగారు. వాటిని ప్రణాళికా బద్ధంగా చేపట్టి, పూర్తి చేస్తాం. 

*అత్యధిక మెజారిటీ నా బాధ్యత పెంచింది*

నేను మంగళగిరిలో పుట్టకపోయినా 2019లో మంగళగిరి నా సొంత ఊరుగా భావించి ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీచేశా. ఇక్కడ ప్రజలను అర్థం చేసుకునేలోపే ఎన్నికలు అయిపోయాయి, 5300 ఓట్ల తేడాతో నేను ఆనాడు ఓడిపోయా. ఆ ఓటమి నాలో కసి పెంచింది. ఐదు సంవత్సరాలు కష్టపడి మీ మనసు గెలుచుకొని ఇక్కడనుంచే శాసనసభ్యుడిగా అసెంబ్లీకి వెళ్లాలని నిర్ణయించుకున్నా. ఎన్నికల ప్రచారంలో ఎన్ని ఓట్లతో నేను 2019లో ఓడిపోయానో, దానిపక్కన ఒక్క సున్నా పెట్టి ఆ మెజారిటీతో నన్ను గెలిపించాలని కోరా. మీరు నన్ను ఎంత ఎక్కువ మెజారిటీతో గెలిపిస్తే అంత బలం వస్తుంది, చంద్రబాబు, పవనన్నతో పోరాడి నిధులు తెస్తానని ఆనాడు హామీ ఇచ్చా. మీ ఆశీస్సులతో ఆంధ్రరాష్ట్ర చరిత్రలోనే టాప్-3 మెజారిటీతో విజయం సాధించా. నేను 53వేల మెజారిటీ అడిగితే, 92వేల ఓట్ల ఆధిక్యతతో నన్ను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించారు. మీరిచ్చిన మెజారిటీతో నా బాధ్యత పెరిగింది. ఆనాటి నుంచి అహర్నిశలు మంగళగిరి ప్రజల గురించే ఆలోచిస్తున్నా. 

*రూ.2వేల కోట్ల ఆస్తి పంపిణీ చేశాం*

2019 ఎన్నికల సమయంలో అనేకమంది నాయకులు మంగళగిరి ప్రజల ఇంటిపట్టాల సమస్యపై హామీ ఇవ్వాలని నన్ను కోరారు. ఆనాడు సమస్య అర్థం కాకపోవడంతో నేను హామీ ఇవ్వలేకపోయా. గత ఎన్నికల్లో గడపగడపకు వచ్చినపుడు దశాబ్ధాలుగా ఇక్కడే జీవిస్తున్న వారితో మాట్లాడాక సమస్య అర్థమైంది. సొంత ఇల్లు ఒక ఎమోషన్. కుటుంబమంతా చెమటోడ్చి కష్టపడి ఇల్లు కట్టుకున్నారు. అధికారులు, రాజకీయ నాయకులు ఆ ఇల్లు మీది కాదు, రేపు మాపో ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని ప్రతిక్షణం భయపెట్టే పరిస్థితి ఆనాడు ఉండేది. దానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకే ఆనాడు నేను హామీ ఇచ్చారు. మూడోవిడత సుమారు 400 మందికి శాశ్వత పట్టాలు కల్పిస్తున్నది మీ కూటమి ప్రభుత్వం. బట్టలు పెట్టి పసుపు,కుంకుమలతో పట్టాలు ఇస్తానని ఆనాడు ఇచ్చిన హామీ ఈరోజు నిలబెట్టుకుంటున్నా. మొదటి విడతలో 3,002, రెండోవిడతలో 2,670, మూడోవిడతలో 388 పట్టాలు కలిపి మొత్తం సుమారు రూ.2వేల కోట్ల విలువ ఆస్తికి ప్రజలకు శాశ్వత హక్కులు కల్పించింది ప్రజాప్రభుత్వం.

*రాష్ట్రానికి దిక్సూచిగా మంగళగిరి మోడల్*

మంగళగిరి మొదటిపెట్టిన ప్రక్రియ ఈరోజు యావత్ రాష్ట్రవ్యాప్తంగా అమలవుతోంది. మంగళగిరిలో పట్టాల సమస్యను నేను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినపుడు ఆంధ్రప్రదేశ్ లో ఈ సమస్య ఎక్కడున్నా పరిష్కరించాల్సి ఉందని ఆయన నాతో చెప్పారు. అధికారులు, నాయకుల కనీసం ఒక్క గ్లాసు మంచినీరు కూడా తీసుకోకుండా ఇళ్లకు వెళ్లి వివరాలు తీసుకున్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు మేమంతా ఒక పట్టుదల, కమిట్ మెంట్ తో పనిచేస్తున్నాం. మంగళగిరిలో వేసిన పునాది ఆంధ్ర రాష్ట్రానికి దిక్సూచిగా మారింది. ఇటీవల విశాఖపట్నంలో 29వేల పట్టాలను ప్రజాప్రభుత్వం ప్రజలకు అందించింది. త్వరలో విజయవాడలో కూడా మరో 24వేలమందికి అందించబోతోంది. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారికి పేదల పట్ల ఉన్న కమిట్ మెంట్. 

*దేశంలోనే ఆదర్శంగా నిడమర్రు స్కూలు*

ఇంకో పక్కన విద్యాశాఖ మంత్రిగా అనేక సంస్కరణలు తీసుకొచ్చా. కానీ సొంత నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఏదోఒకటి చేయాలన్న ఉద్దేశంతో నిడమర్రు స్కూలును భారతదేశంలో ఎక్కడా లేని విధంగా తీర్చిదిద్దటం జరిగింది. మొన్న మంగళగిరిలో ఒక కార్యక్రమానికి వెళితే నిడమర్రు స్కూలులో వారి బిడ్డకు సీటు కావాలని నాతో గొడవపడింది. ప్రభుత్వ పాఠశాలల్లో సీట్ల కోసం పోటీ మంగళగిరి నుంచే మొదలైంది. ఇది కేవలం ఒక నిడమర్రు స్కూలు కాదు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను ఇదేవిధంగా తయారుచేయాలన్న ఆలోచనతో నేను పనిచేస్తున్నా. లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని పెద్దఎత్తున అభివృద్ధి చేస్తున్నాం. పార్కులు, కమ్యూనిటీ హాళ్లు, రోడ్ల నిర్మాణం చేపడుతున్నాం. మూసేసిన అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించాం. సురక్షితమైన తాగునీరు అందించడానికి వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశాం. గుడులు, చర్చిలు, మసీదులను కూడా ఈరోజు ప్రజా ప్రభుత్వం అద్భుతంగా అభివృద్ధి చేస్తోంది. స్మశానాలను కూడా అభివృద్ధి చేస్తున్నాం. 

*నాపై ఉంచిన నమ్మకానికి రుణం తీర్చుకుంటా*

మంగళగిరి ప్రజలకి అన్ని రకాలుగా అండగా నిలబడాలి, సౌకర్యాలు కల్పించాలనే ఆలోచనతో ప్రజా ప్రభుత్వం పనిచేస్తోంది. 2019-24లో సొంత నిధులు ఖర్చుపెట్టి మంగళగిరి ప్రజల కోసం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశా. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ పనులు మేము ఆపలేదు. ఇంకా మెరుగ్గా ముందుకు తీసుకెళ్తున్నాం. మీరు నాపై ఉంచిన నమ్మకానికి మీ రుణం తీర్చుకుంటున్నా. మీకోసం అహర్నిశలు కష్టపడతా. ఎప్పుడూ మంగళగిరి ప్రజల గురించే ఆలోచిస్తున్నా. నేను వేరే ఏ పని పెట్టుకోవట్లేదు. నాకు ఎంత పని ఒత్తిడి ఉన్నా మంగళగిరి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నా మీ ఆశీస్సులు ఎప్పుడూ మాకు అవసరం. నాయకుల దగ్గర నుంచి ఓ కార్యకర్త నా వరకు అందరం మీ గురించే ఆలోచిస్తున్నాం. మీరు ఇచ్చిన మెజారిటీ వల్లే ఇంత పెద్దఎత్తున అభివృద్ధి చేయగలుగుతున్నాం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా గత ఎన్నికల్లో నన్ను గెలిపించినట్లుగానే కూటమి అభ్యర్దులను ఆశీర్వదించి మంచి మెజారిటీతో గెలిపించండి. 

*ఎక్కువ హామీలు ఇవ్వను...ఇచ్చినవన్నీ నిలబెట్టుకుంటా*

నేను ఎక్కువ హామీలు ఇవ్వను. కానీ ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకుంటా. డోర్ టు డోర్ కార్యక్రమం సమయంలో మీరు చెప్పిన సమస్యలన్నీ రాసుకున్నా. ప్రతిదీ నేను మానిటర్ చేస్తున్నా. పురోగతిపై ప్రతి వారం సమీక్ష చేస్తున్నా. దాంట్లో భాగంగా ఇంటి పట్టాల కార్యక్రమం చేపట్టాం. ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి. యుద్ధ ప్రాతిపదికగా చేయాల్సిన పనులన్నీ తొలుత చేపడుతున్నాం. భూగర్భ డ్రైనేజి,  పైప్ లైన్ ద్వారా తాగునీరు, అండర్ గ్రౌండ్ గ్యాస్ పైప్ లైన్ ప్రక్రియ పూర్తయిన చోట వెంటనే రోడ్లు వేస్తామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎంఎస్ఐడీసీ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనుంజయ్, టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆకుల జయసత్య, టీడీపీ గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, మంగళగిరి నియోజకవర్గ పరిశీలకులు ముమ్మిడి సత్యనారాయణ, మంగళగిరి పట్టణ టీడీపీ అధ్యక్షుడు పడవల మహేష్, మండల పార్టీ అధ్యక్షుడు పల్లబోతుల శ్రీనివాసరావు, తాడేపల్లి పట్టణ టీడీపీ అధ్యక్షుడు వల్లభనేని వెంకట్రావు, రూరల్ అధ్యక్షుడు దాసరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.