డా. జీఎస్సార్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
డా. జీఎస్సార్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
చుంచుపల్లి, సూర్య(మేజర్ న్యూస్) - తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగలో భాగంగా 4వ రోజు నాన బియ్యం బతుకమ్మ వేడుకలు విద్యానగర్ జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి.డా. జీఎస్సార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆటపాటలతో సందడి చేశారు. జనసేన వీర మహిళలు స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు.బతుకమ్మ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీక అని, సంస్కృతిని పరిరక్షించేందుకు ఇలాంటి వేడుకలు అవసరమని నిర్వాహకులు తెలిపారు. పాల్గొన్న మహిళల్లో ఒకరికి పట్టుచీర, ఐదుగురికి కన్సోలేషన్ బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు.