''బతుకమ్మ''ను భావితరాలకు అందించాలి
సంస్కృతి సాంప్రదాయాలను భావితరాల అందించాలని మార్కెట్ చైర్ పర్సన్
యాట గీతా నరసింహ సూచించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా, ఆడబిడ్డల ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆమనగల్లు మార్కెట్ చైర్‌పర్సన్ యాట గీతా నరసింహ ఆకాంక్షించారు. బతుకమ్మ పండుగసందర్భంగాజిల్లాలోనిమహిళలందరికీశుభాకాంక్షలు తెలిపారు.పూలతో పేర్చే బతుకమ్మలతో తెలంగాణ ఆడపడుచులు జరుపుకునే ఈ పండుగ రాష్ట్రసంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. బతుకమ్మ సంబరాలు ప్రతి ఇంటా సంతోషాలను నింపాలని, మహిళల జీవితాల్లో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం వెల్లివిరియాలనిఆకాంక్షించారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలనుభావితరాలకు అందిస్తూ, బతుకమ్మ పండుగ వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటాలని ఆమె పిలుపునిచ్చారు.
ఎ చంద్రశేఖర్: మేజర్ న్యూస్, ఆమనగల్లు.