మీన రాశి వారఫలాలు | 25 OCT 2026 - 31 OCT 2026 | Pisces Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani
మీన రాశి వారఫలాలు | 25 OCT 2026 - 31 OCT 2026 | Pisces Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani
♓మీన రాశి… ప్రారంభంలో వ్యక్తిగత విషయాలలో, ఆరోగ్యంలో బద్దకాన్ని అధిగమించాలి. ఉద్వేగాలకు దూరంగ, ప్రశాంతంగా, ఆత్మీయులతో ఆర్థిక ఘర్షణ లేకుండా మంచి ఆలోచనలను సద్వినియోగ పరుచుకోవాలి. కుటుంబ విషయాలలో, సంతాన వర్గంతో, ఆర్థిక నిర్ణయాలలో, వాక్కులో కఠినతను నియంత్రిస్తూ ముందుకు వెళితే అనుకూలత. ప్రియమైన వ్యక్తులతో ఆలోచనల సమన్వయం ముఖ్యం. తొందరపాటు నిర్ణయాలు కాకుండా ఆచితూచి వ్యవహరించాలి. మధ్యలో శ్రమతో అనుకున్న పనులు సాధించినప్పటికీ, వృత్తిలో కొలీగ్స్ సహకరించిన, కమ్యూనికేషన్ అనుకూలంగా ఉన్నప్పటికీ, కొన్ని సందర్భాలలో పనుల జాప్యం వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలకు,విమర్శలకు తావివ్వకుండా జాగ్రత్తపడాలి. వారాంతం గృహసౌఖ్యం, ప్రశాంతత పై దృష్టిసారిస్తారు. బంధు మిత్రుల కలయిక. అనవసర చర్చలకి అవకాశం ఇవ్వరాదు. ఆదిత్య హృదయ పారాయణ మేలు.