ధనుస్సు రాశి వారఫలాలు | 25 OCT 2026 - 31 OCT 2026 | Sagittarius Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani
ధనుస్సు రాశి వారఫలాలు | 25 OCT 2026 - 31 OCT 2026 | Sagittarius Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani
♐ధను రాశి… ప్రారంభంలో గృహ, స్థిరాస్తి, తల్లి ఆరోగ్యరీత్యా శ్రద్ధ, ఖర్చులు. భూ, వ్యవసాయ విషయాల పై దృష్టి. వాయిదాలు, ఖర్చులు వున్నా వివేకము, బుద్ధి బలంతో అధిగమిస్తారు. ఆకస్మిక మార్పు వల్ల ఉద్వేగాలు, వ్యక్తిగత ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. ప్రియమైన వారి ఆరోగ్య, అభివృద్ధి, అవసరాలు రీత్యా ఖర్చులు చేసినప్పటికీ ఘర్షణలకు తావివ్వరాదు. నిర్ణయాలలో, ఆలోచనల సమన్వయంలో ప్రశాంతత చాలా ముఖ్యం. మధ్యలో అధిక శ్రమతో పనులు సాధిస్తారు, స్త్రీల సహకారం అనుకూలం. విద్యార్థులు పోటీలలో శ్రమతో సాధిస్తారు. నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆలస్యమైనా పనులు ముందుకు వెళతాయి. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వారాంతం సంఘంలో గౌరవం నూతన పరిచయాలు వృత్తి వ్యాపారాల అభివృద్ధి. ఉన్నత స్థాయి వ్యక్తుల సహకారం. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నరసింహస్వామి ఆరాధన మేలు.