బిగ్ బాస్ హౌస్‌లోకి సీరియల్ బ్యూటీ.. వారానికి రూ.4 లక్షల రెమ్యునరేషన్ అంటూ టాక్!
బిగ్ బాస్ హౌస్‌లోకి సీరియల్ బ్యూటీ.. వారానికి రూ.4 లక్షల రెమ్యునరేషన్ అంటూ టాక్!
షో ప్రారంభాబుల్లితెరపై బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ సందడి మొదలయ్యేందుకు రోజులు దగ్గరపడుతున్నాయి.నికి ముందే కంటెస్టెంట్లుగా ఎవరెవరు వస్తారనే చర్చ సోషల్ మీడియాలో జోరందుకుంది. ఇప్పటికే పలువురు టీవీ నటీనటులు, జబర్దస్త్ కమెడియన్స్, ఫోక్ డ్యాన్సర్ల పేర్లు వైరల్ అవుతుండగా.. తాజాగా మరో సీరియల్ హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది.
అందం, అభినయంతో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన డెబ్జానీ మోదక్ బిగ్ బాస్ 10లోకి ఎంట్రీ ఇవ్వనున్నారనే ప్రచారం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
తెలుగులో సీరియల్స్‌తో మంచి గుర్తింపు
బెంగాలీకి చెందిన డెబ్జానీ మోదక్.. తెలుగులో ‘ఎన్నెన్నో జన్మల బంధం’ సీరియల్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమయ్యారు. తెలుగు భాషపై పూర్తి పట్టు లేకపోయినా తన నటనతో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత ‘సత్యభామ’ వంటి సీరియల్స్‌తోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
కేవలం ఫ్యామిలీ ఆడియన్స్‌కే కాకుండా యువతలోనూ ఆమెకు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఏర్పడింది. టీవీ ఎంటర్టైన్మెంట్ షోలలో తన చలాకీ మాటలు, కామెడీ టైమింగ్‌తోనూ అలరించారు.
వారానికి రూ.4 లక్షలు.. నిజమేనా?
ఇప్పుడు బిగ్ బాస్ 10లో డెబ్జానీ మోదక్ పాల్గొనబోతున్నారనే ప్రచారం మరింత ఆసక్తిని పెంచుతోంది. అంతేకాదు, ఆమెకు వారానికి సుమారు రూ.4 లక్షల రెమ్యునరేషన్ ఇవ్వనున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. అయితే ఈ రెమ్యునరేషన్‌కు సంబంధించి అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు.
డెబ్జానీ నిజంగానే బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెడితే.. ఆమె గ్లామర్, కామెడీ, ఆటతీరుతో షోకు మంచి ఎంటర్టైన్మెంట్ యాడ్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు.
లిస్ట్‌లో ఇంకా చాలామంది!
బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ల జాబితాలో ఇప్పటికే మాధురి రాథోడ్, ఈశ్వర సాయి, జబర్దస్త్ పవిత్ర, వర్ష, ముఖేష్ గౌడ, సుహాసిని వంటి పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. ‘గుండె నిండ గుడి గంటలు’ సీరియల్ ఫేమ్ బాలు పేరు కూడా ప్రచారంలోకి వచ్చినప్పటికీ.. తాను బిగ్ బాస్‌కు వెళ్లడం లేదని వీడియో ద్వారా స్పష్టం చేశారు.
ఇక సీరియల్ బ్యూటీలు పల్లవి గౌడ, ‘గుప్పెడంత మనసు’ ఫేమ్ రక్షిత, జబర్దస్త్ ఫేమ్ నూకరాజు పేర్లు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
అయితే వీరిలో ఎవరు నిజంగా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెడతారనే దానిపై త్వరలోనే అధికారిక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అప్పటివరకు కంటెస్టెంట్ల పేర్లపై వస్తున్న వార్తలు మాత్రం సోషల్ మీడియాలో ఆసక్తిని రేపుతూనే ఉన్నాయి.
Also Read:తిరుమల భక్తులకు బిగ్ గుడ్‌న్యూస్.. ఇక తిరుపతికి మరింత స్పీడ్‌గా! కొత్త రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్