BREAKING
పెద్దవీధిలో వైభవంగా దేవీ నవ రాత్రులు నిలిచిపోయిన బలిజ కళ్యాణమండపం కు 30 లక్షలు ఎంపీ నిధులు దేవులనాయక్ కు జన్మదిన శుభాకాంక్షలు S V V స్కూల్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు నేటి రాశి ఫలాలు 13 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 13 అక్టోబర్ 2026 అల్లర్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదు యువతను మోసం చేసిన కాంగ్రెస్ కు పట్టభద్రులు బుద్ధి చెప్పాలి మండల అభివృద్ధిపై సర్వసభ్య సమావేశం దర్యాప్తులో జాప్యం వద్దు.. విధుల్లో అప్రమత్తంగా ఉండాలి జానేష్ కుమార్ ను విధుల నుండి తొలగించాలి చుక్కలు చూపిస్తున్న బుకింగ్స్: ఢిల్లీ చారిత్రక 'రామ్‌లీలా మైదానం'లో ఈ ఏడాది మిగిలింది కేవలం 3 రోజులే.. కారణాలు ఇవే! యూఎస్ ‘పెర్మ్’ నిలిపివేతతో మాపై ఎలాంటి ప్రభావం ఉండదు: తేల్చిచెప్పిన హెచ్‌సీఎల్‌టెక్.. కారణాలు ఇవే! సముద్రాలలో నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి స్టార్‌లింక్ స్టేషన్ దగ్ధం కేసు...జర్మనీలో ఇద్దరు టర్కీ పౌరుల అరెస్ట్

తిరుమల భక్తులకు బిగ్ గుడ్‌న్యూస్.. ఇక తిరుపతికి మరింత స్పీడ్‌గా! కొత్త రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్

Select Suryaa Now
తిరుమల భక్తులకు బిగ్ గుడ్‌న్యూస్.. ఇక తిరుపతికి మరింత స్పీడ్‌గా! కొత్త రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్

రైలు ప్రయాణికులకు భారీ ఊరట.. గూడూరు-రేణిగుంట మధ్య మూడో రైల్వే లైన్

తిరుమల శ్రీవారి దర్శనం కోసం తిరుపతి వచ్చే భక్తులకు రైల్వేశాఖ తీపికబురు చెప్పింది. ప్రయాణ సమయాన్ని తగ్గించడంతో పాటు రైళ్ల రాకపోకలను మరింత వేగవంతం చేసే కీలక ప్రాజెక్టుకు అడుగులు పడుతున్నాయి. గూడూరు-రేణిగుంట మధ్య మూడో రైల్వే లైన్ నిర్మాణానికి రైల్వేశాఖ చర్యలు ముమ్మరం చేసింది.

ఈ ప్రాజెక్టులో భాగంగా భూసేకరణకు తాజాగా గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో మూడో రైల్వే లైన్ నిర్మాణానికి మరో కీలక అడ్డంకి తొలగినట్లైంది.

రద్దీకి చెక్ పెట్టేలా..

గూడూరు-రేణిగుంట మార్గం దక్షిణ భారతదేశంలోని కీలక రైల్వే మార్గాల్లో ఒకటి. ఈ రూట్‌లో నిత్యం భారీగా రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. పెరుగుతున్న ట్రాఫిక్ కారణంగా రైళ్ల నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో మూడో లైన్ నిర్మాణానికి రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది.

ఈ లైన్ అందుబాటులోకి వస్తే రైళ్ల రాకపోకలకు మరింత వెసులుబాటు కలగనుంది. రైళ్లను వేగంగా నడిపేందుకు, ట్రాఫిక్‌ను సమర్థంగా నిర్వహించేందుకు అవకాశం ఏర్పడుతుంది.

భూసేకరణకు గ్రీన్ సిగ్నల్

మూడో రైల్వే లైన్ కోసం భూసేకరణకు సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్‌లో నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ ప్రక్రియపై ఎలాంటి అభ్యంతరాలు నమోదు కాకపోవడంతో తాజాగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో భూసేకరణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు అధికారికంగా మార్గం సుగమమైంది.

తిరుమల భక్తులకు భారీ ప్రయోజనం

గూడూరు-రేణిగుంట మధ్య మూడో రైల్వే లైన్ పూర్తయితే తిరుపతి వచ్చే ప్రయాణికులకు ప్రయాణ సమయం తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా శ్రీవారి దర్శనం కోసం రైళ్లలో వచ్చే భక్తులకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారనుంది.

రైళ్ల రాకపోకలు వేగవంతం కావడంతో పాటు తిరుపతి నుంచి చెన్నై, విజయవాడ, బెంగళూరు వంటి ప్రధాన నగరాలకు వెళ్లే ప్రయాణికులకు కూడా ప్రయోజనం కలగనుంది. సరుకు రవాణా రైళ్ల నిర్వహణ మరింత సమర్థంగా సాగేందుకు అవకాశం ఉంటుంది.

మొత్తంగా ఈ మూడో రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే గూడూరు-రేణిగుంట మార్గంలో రైళ్ల రద్దీ తగ్గడంతో పాటు ప్రయాణికులకు వేగవంతమైన రైలు సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో తిరుమల వెళ్లే భక్తులకు ప్రయాణం మరింత సులభంగా మారనుంది.

Also Read: వర్షాభావంతో రైతుల కష్టాలు.. చంద్రబాబుపై వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు