BREAKING
ఆకస్మిక వరదల్లో 105 మంది భారతీయులు గల్లంతు తిరుమల భక్తులకు బిగ్ గుడ్‌న్యూస్.. ఇక తిరుపతికి మరింత స్పీడ్‌గా! కొత్త రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ వర్షాభావంతో రైతుల కష్టాలు.. చంద్రబాబుపై వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు ట్రాఫిక్ చలాన్లు కట్టలేదా? ఇక ఫాస్టాగ్ నుంచే డబ్బులు కట్.. హైదరాబాద్ పోలీసుల సరికొత్త ప్లాన్! వారణాసి తర్వాత మహేష్ బాబుతో సినిమా ఉంటుందా? అనిల్ రావిపూడి ఏమన్నారంటే.. వైఎస్ జగన్‌కు మహిళా నేతల రాఖీలు.. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో రాఖీ పౌర్ణమి సందడి గండక్ నదిలో పెరుగుతున్న నీటిమట్టం: బీహార్‌లో హైఅలర్ట్! హైదరాబాద్‌లో 12 మంది నకిలీ డాక్టర్ల అరెస్ట్ మేడారం దేవస్థానానికి రూ. 5 లక్షల కరెంట్‌ బిల్లు షాక్‌! హెలికాప్టర్ ఇంజన్ 'అరవల్లి' తయారీకి హెచ్‌ఏఎల్-సాఫ్రాన్ చారిత్రాత్మక ఒప్పందం రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై మండిపడ్డ బీజేపీ ఎంపీ బాన్సురీ స్వరాజ్ ఇరుముడి సినిమా ప్రదర్శన నిలిపివేత కూతురి వ్యాఖ్యలతో మాకేంటి సంబంధం నేపాల్‌లో ఆకస్మిక వరదల విధ్వంసం యుఎన్ కమిటీ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్

ట్రాఫిక్ చలాన్లు కట్టలేదా? ఇక ఫాస్టాగ్ నుంచే డబ్బులు కట్.. హైదరాబాద్ పోలీసుల సరికొత్త ప్లాన్!

Select Suryaa Now
ట్రాఫిక్ చలాన్లు కట్టలేదా? ఇక ఫాస్టాగ్ నుంచే డబ్బులు కట్.. హైదరాబాద్ పోలీసుల సరికొత్త ప్లాన్!

పెండింగ్ చలాన్లకు చెక్ పెట్టేందుకు కొత్త విధానం.. ఫాస్టాగ్‌తో ఈ-చలాన్ల అనుసంధానంపై కసరత్తు

హైదరాబాద్‌లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులకు ఇక మరింత గట్టి షాక్ తగలనుంది. ట్రాఫిక్ చలాన్లు చెల్లించకుండా ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంచుతున్న వాహనదారులపై అధికారులు కొత్త అస్త్రాన్ని ప్రయోగించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ఫాస్టాగ్ ఖాతాతో ట్రాఫిక్ చలాన్ల వ్యవస్థను అనుసంధానం చేసే ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు.

ప్రస్తుతం హైదరాబాద్‌లో అనేక వాహనాలపై పదుల సంఖ్యలో ఈ-చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి. జరిమానాలు చెల్లించకుండా వాహనాలను నడుపుతున్న వారి సంఖ్య కూడా గణనీయంగానే ఉంటోంది. జరిమానాలు విధిస్తున్నప్పటికీ.. వాటి వసూళ్లు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో అధికారులు కొత్త మార్గాలపై దృష్టి సారిస్తున్నారు.

ఫాస్టాగ్ నుంచే జరిమానా వసూలు?

కొత్త ప్రతిపాదన అమల్లోకి వస్తే.. వాహనంపై పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లను సంబంధిత ఫాస్టాగ్ ఖాతాతో అనుసంధానించి, నిర్ణీత నిబంధనల ప్రకారం జరిమానా మొత్తాన్ని ఆటోమేటిక్‌గా మినహాయించే అవకాశం ఉంటుంది. అయితే ఈ విధానం ఇంకా ప్రతిపాదన దశలోనే ఉంది. దీనిపై అధికారిక నిర్ణయం వెలువడాల్సి ఉంది.

పెండింగ్ ఈ-చలాన్ల వసూళ్లను వేగవంతం చేయడంతో పాటు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను అరికట్టడమే ఈ ప్రతిపాదన వెనుక ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. జరిమానా తప్పదనే భయం ఉంటే వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించే అవకాశం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.

అధికారుల కీలక వ్యాఖ్యలు

ఇటీవల సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్‌సీఎస్‌సీ) వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సన్‌ప్రీత్ సింగ్ ఈ ప్రతిపాదనకు సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. ఫాస్టాగ్ వ్యవస్థను ఉపయోగించి పెండింగ్ ట్రాఫిక్ జరిమానాల వసూళ్లను సులభతరం చేసే అవకాశాలపై చర్చలు జరుగుతున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం ఈ అంశంపై హెచ్‌ఎండీఏతో కూడా చర్చలు జరుగుతున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అయితే ఫాస్టాగ్ నుంచి చలాన్ డబ్బులు కట్ చేసే విధానం ఎప్పుడు అమల్లోకి వస్తుంది? ఏ నిబంధనల ప్రకారం వసూలు చేస్తారు? అనే అంశాలపై ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.

ఈ ప్రతిపాదన అమలైతే ట్రాఫిక్ చలాన్లు పెండింగ్‌లో పెట్టే వాహనదారులకు మాత్రం గట్టి హెచ్చరికగా మారే అవకాశం ఉంది. ఇకపై చలాన్ కట్టకుండా తప్పించుకోవడం అంత ఈజీ కాదన్న సంకేతాన్ని ఈ కొత్త విధానం ఇవ్వనుంది.