BREAKING
గండక్ నదిలో పెరుగుతున్న నీటిమట్టం: బీహార్‌లో హైఅలర్ట్! హైదరాబాద్‌లో 12 మంది నకిలీ డాక్టర్ల అరెస్ట్ మేడారం దేవస్థానానికి రూ. 5 లక్షల కరెంట్‌ బిల్లు షాక్‌! హెలికాప్టర్ ఇంజన్ 'అరవల్లి' తయారీకి హెచ్‌ఏఎల్-సాఫ్రాన్ చారిత్రాత్మక ఒప్పందం రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై మండిపడ్డ బీజేపీ ఎంపీ బాన్సురీ స్వరాజ్ ఇరుముడి సినిమా ప్రదర్శన నిలిపివేత కూతురి వ్యాఖ్యలతో మాకేంటి సంబంధం నేపాల్‌లో ఆకస్మిక వరదల విధ్వంసం యుఎన్ కమిటీ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్ ఉల్లి, చక్కెర ధరలు పెరిగితే NAFED నుండి సేకరణ 200 రోజుల తర్వాత థాయిలాండ్‌కు అమెరికా యుద్ధనౌక 'లింకన్' జనగామ జిల్లాలో శిశు మహిళా సమృద్ధి యాప్ ను రద్దు చేయాలని కోరుతూ ప్రజాభవన్ లో వినతి మై భారత్ వాలంటీర్ల నియామకం: దరఖాస్తు గడువు పొడిగింపు.. నెలకు రూ.5 వేల గౌరవ వేతనం ‘ఇరుముడి’ చూసి ఎమోషనల్ అయిన రష్మిక.. రవితేజ సినిమా తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం తెచ్చిందన్న విజయ్ దేవరకొండ! ఏపీ డిగ్రీ ప్రవేశాలు 2026: ముగింపు దశకు కౌన్సెలింగ్.. ఆగస్టు 27తో వెబ్ ఆప్షన్ల గడువు పూర్తి!

ఇరుముడి సినిమా ప్రదర్శన నిలిపివేత

Select Suryaa Now
ఇరుముడి సినిమా ప్రదర్శన నిలిపివేత

మక్తల్ వెంకటరమణ థియేటర్ వద్ద ధర్నా
మక్తల్: మక్తల్ పట్టణంలోని వెంకటరమణ థియేటర్‌లో 'ఇరుముడి' సినిమా ప్రదర్శనను హఠాత్తుగా నిలిపివేయడంపై భక్తులు, ప్రేక్షకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. థియేటర్ యాజమాన్యం తీరును నిరసిస్తూ బుధవారం థియేటర్ ఎదుట ధర్నా చేపట్టారు.

థియేటర్ యాజమాన్యం ముందస్తు సమాచారం లేకుండా 'ఇరుముడి' సినిమాను థియేటర్ నుంచి తీసివేయడం పట్ల ప్రేక్షకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాను ప్రదర్శిస్తామని చెప్పి మధ్యలోనే తీసివేయడం సరికాదని, దీనివల్ల భక్తుల భావోద్వేగాలు దెబ్బతిన్నాయని ఆందోళనకారులు పేర్కొన్నారు. వెంటనే 'ఇరుముడి' సినిమా ప్రదర్శనను పునరుద్ధరించాలని, ప్రేక్షకులకు క్షమాపణ చెప్పాలని థియేటర్ ముందు బైఠాయించి నినాదాలు చేశారు. ఈ ఘటనతో థియేటర్ ప్రాంగణంలో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది.