BREAKING
బీజింగ్‌లో 25వ ప్రత్యేక ప్రతినిధుల సమావేశం న్యూఢిల్లీలో ఘనంగా జాతీయ షిప్పింగ్ బోర్డ్ తొలి 'సాగర్ సంవాద్' హోర్ముజ్ జలసంధిలో మందుపాతరలు తొలగించాం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ప్రపంచ బ్యాడ్మింటన్ కాంస్య పతక విజేతలు గాయత్రి - త్రిసా జాలీ ‘ఆపరేషన్ సింధూర్’ విజయం వెనుక స్పష్టమైన వ్యూహం తప్పులతడకగా స్మార్ట్ రేషన్ కార్డులు కంటతడి పెట్టిస్తున్న ఎరువుల కొరత మండలంలో ఘనంగా వన మహోత్సవ కార్యక్రమం. కంగనా-తాప్సీ వివాదం ఎప్పుడు ముగుస్తుంది? తాప్సీ క్లారిటీ.. మీడియాపైనే అసహనం Toxic Movie: టాక్సిక్ సినిమా ఫస్ట్ రివ్యూ.. రోడ్డు దుమ్మును తగ్గించి, వాయు నాణ్యతను మెరుగుపరచేందుకు వర్క్‌షాప్ పాలు, పనీర్‌ ప్యాకెట్‌ ఉబ్బిందా? ఎక్స్‌పైరీ చూడటం సరిపోదు.. ఈ విషయం తెలుసుకోండి! మొక్కలు నాటుదాం... పర్యావరణం కాపాడుదాం... కృతి సనన్‌ ఘాటు కౌంటర్‌.. ‘సంస్కృతి గుండెల్లో ఉంటుంది.. దుస్తుల్లో కాదు’ Osmania University: ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ అడ్మిషన్లు.. 648 సీట్లకు దరఖాస్తుల ఆహ్వానం!

కంటతడి పెట్టిస్తున్న ఎరువుల కొరత

Select Suryaa Now
కంటతడి పెట్టిస్తున్న ఎరువుల కొరత

యూరియా కోసం అష్టకష్టాలు!

ఈ-యాప్‌ సాంకేతిక లోపాలతో రైతుల అరిగోస

కంటతడి పెట్టిస్తున్న ఎరువుల కొరత

తెలంగాణ బ్యూరో, ప్రతినిధి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ఎరువుల యాప్‌తో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యూరియా స్టాక్‌ వివరాలు ఈ-యా్‌పలో అప్‌లోడ్‌ చేసిన 5 నుంచి 10 నిమిషాల్లోనే స్టాక్‌ అయిపోతోంది. వరి సాగు తగ్గించి ఆరుతడి పంటలు సాగు చేయాలని అధికారులు అవగాహన కల్పించడంతో కొంతవరకు వరి సాగు తగ్గింది. అయినప్పటికీ సిద్దిపేట డివిజన్‌ పరిధిలో యూరియా డిమాండ్‌ మాత్రం తగ్గడం లేదు. డిమాండ్‌కు తగినట్లుగా యూరియా సరఫరా చేయాలని అధికారులు నివేదికలు పంపినప్పటికీ, యాప్‌లోనే బుక్‌ చేసుకోవాలనే నిబంధన రైతులకు శాపంగా మారింది. సిద్దిపేట వ్యవసాయ డివిజన్‌ పరిధిలో గతేడాది వరి సాగు 86 వేల ఎకరాలు కాగా, ఈ వానకాలంలో 73 వేల ఎకరాలకు పడిపోయింది. ఆ స్థానంలో కంది, మొక్కజొన్న తదితర ఆరుతడి పంటలు సాగయ్యాయి. ఈ వానకాలం సీజన్‌కు 12వేల మెట్రిక్‌ టన్నుల యూరియా డిమాండ్‌ ఉండగా, నేటి వరకు కేవలం 4,500 మెట్రిక్‌ టన్నులు మాత్రమే సరఫరా అయింది. మరోవైపు యాప్‌లో సర్వర్‌ డౌన్‌ కావడం, ఓటీపీలు సకాలంగా రాకపోవడం, స్టాక్‌ అయిపోయినా అదనంగా బుకింగ్‌ కావడంతో గందరగోళం నెలకొంటున్నది. urea1.jpgనంగునూరు మండలం వెంకటాపూర్‌ మురుదాబాద్‌, మైసంపల్లి గ్రామాలు ఈ-యా్‌పలో కనిపించడం లేదు. ఫార్మర్‌ రిజిస్ర్టీ నుంచే ఆ గ్రామాల పేర్లు రాలేదు. ఎల్‌జీ కోడ్స్‌ మ్యాప్‌ కాలేదు. అప్పటి నుంచి అధికారులు సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన సమస్య పరిష్కారం కాలేదు. యాప్‌లో ఆ రెండు గ్రామాల పేర్లు లేక ఇతర గ్రామాల రైతులను ఆశ్రయించి ఎంతో కొంత ఎరువులు తెచ్చుకుంటున్నారు. దౌల్తాబాద్‌ మండలంలోనూ యూరియా కొరత తీవ్రంగా వేధిస్తోంది. జిల్లాలో ఈ వానకాలంలో సుమారు 6 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. 3 లక్షల పైగా ఎకరాల్లో వరి, 75 వేల ఎకరాల్లో పత్తి, 80 వేల ఎకరాల్లో మొక్కజొన్న, లక్ష ఎకరాల్లో మిర్చి ఇతర కూరగాయ పంటలు సాగు చేశారు.