పార్టీ లైన్ దాటితే రేవంత్ రెడ్డిని అయినా ఉపేక్షించం
టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉందని, అయితే క్రమశిక్షణ తప్పి హద్దులు దాటితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. పార్టీ నిబంధనలు, లైన్ అందరికీ సమానమేనని ఆయన స్పష్టం చేశారు.
"పార్టీ లైన్ దాటితే ఎవరినీ వదిలిపెట్టేది లేదు. ఇది నాతో పాటు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు మంత్రివర్గంలోని అందరూ మంత్రులకు సమానంగా వర్తిస్తుంది." కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అభిప్రాయ స్వేచ్ఛను, ప్రజాస్వామ్యాన్ని అందిస్తుందని, అయితే దానిని లక్ష్మణరేఖ దాటి దుర్వినియోగం చేస్తే చర్యలు తప్పవని తేల్చి చెప్పారు.
పార్టీ ఇమేజ్‌కు భంగం కలిగించేలా ఎవరు వ్యవహరించినా అధిష్టానం తీవ్రంగా పరిగణిస్తుందని, అందరూ పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి పనిచేయాలని ఆయన ఉద్ఘాటించారు.