BREAKING
Osmania University: ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ అడ్మిషన్లు.. 648 సీట్లకు దరఖాస్తుల ఆహ్వానం! జైలు నుంచి వీడియో కాల్ ఎలా? మహిళా అధికారిపై వైరల్ వీడియో దుమారం! 'తెహెల్కా' మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌కు షాక్ మరో ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ పార్టీ లైన్ దాటితే రేవంత్ రెడ్డిని అయినా ఉపేక్షించం సిట్టింగ్ జడ్జితో విచారణకు హరీష్ రావు డిమాండ్ దేవాదుల ఎత్తిపోతల పథకంపై నేడు మంత్రి ఉత్తమ్ సమీక్ష కర్నూలులో ఖాకీల ఇళ్లలోనే కాలా నైట్ తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఒకే ఘటనతో పలు కేసులు.. భయపడేది లేదు: అంబటి రాంబాబు క్యూఆర్ పరిధిలో నేడే 'ఇందిరమ్మ ఇళ్ల' అర్హుల తుది జాబితా విడుదల గచ్చిబౌలిలో ప్రమాదకర భవనాల కూల్చివేత ఏపీలో ఇన్‌సర్వీస్ టీచర్లకు ప్రత్యేక టెట్ స్నాప్ చాట్ లో పరిచయం ఆమెకు జరిగింది ఆర్ధిక మోసం శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య

క్యూఆర్ పరిధిలో నేడే 'ఇందిరమ్మ ఇళ్ల' అర్హుల తుది జాబితా విడుదల

Select Suryaa Now
క్యూఆర్ పరిధిలో నేడే 'ఇందిరమ్మ ఇళ్ల' అర్హుల తుది జాబితా విడుదల

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ (క్యూఆర్) పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. అర్హులైన అభ్యర్థుల తుది జాబితాను నేడు (ఆగస్ట్ 25) అధికారికంగా విడుదల చేయనున్నట్లు హౌసింగ్ బోర్డు అధికారులు వెల్లడించారు.

క్యూఆర్ పరిధిలోని 16 నియోజకవర్గాల నుంచి 60,720 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆగస్ట్ 27 నుంచి 30వ తేదీ వరకు పారదర్శకంగా లాటరీ ప్రక్రియను నిర్వహించనున్నారు.

దరఖాస్తుదారులు తమ పేరు అర్హుల జాబితాలో ఉందో లేదో తెలుసుకోవడానికి తెలంగాణ హౌసింగ్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ tghb.telangana.gov.in ను సందర్శించి వివరాలు సరిచూసుకోవచ్చు. ఏవైనా సందేహాలు లేదా సమాచారం కోసం కాల్ సెంటర్ నంబర్ 040-24603572 ను సంప్రదించవచ్చని హౌసింగ్ బోర్డు వీసీ తెలియజేశారు.