BREAKING
Osmania University: ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ అడ్మిషన్లు.. 648 సీట్లకు దరఖాస్తుల ఆహ్వానం! జైలు నుంచి వీడియో కాల్ ఎలా? మహిళా అధికారిపై వైరల్ వీడియో దుమారం! 'తెహెల్కా' మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌కు షాక్ మరో ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ పార్టీ లైన్ దాటితే రేవంత్ రెడ్డిని అయినా ఉపేక్షించం సిట్టింగ్ జడ్జితో విచారణకు హరీష్ రావు డిమాండ్ దేవాదుల ఎత్తిపోతల పథకంపై నేడు మంత్రి ఉత్తమ్ సమీక్ష కర్నూలులో ఖాకీల ఇళ్లలోనే కాలా నైట్ తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఒకే ఘటనతో పలు కేసులు.. భయపడేది లేదు: అంబటి రాంబాబు క్యూఆర్ పరిధిలో నేడే 'ఇందిరమ్మ ఇళ్ల' అర్హుల తుది జాబితా విడుదల గచ్చిబౌలిలో ప్రమాదకర భవనాల కూల్చివేత ఏపీలో ఇన్‌సర్వీస్ టీచర్లకు ప్రత్యేక టెట్ స్నాప్ చాట్ లో పరిచయం ఆమెకు జరిగింది ఆర్ధిక మోసం శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య

'తెహెల్కా' మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌కు షాక్

Select Suryaa Now
'తెహెల్కా' మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌కు షాక్

రెండు వారాల్లో లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: అత్యాచార కేసులో దోషిగా తేలిన 'తెహెల్కా' (Tehelka) పత్రిక మాజీ ఎడిటర్-ఇన్-చీఫ్ తరుణ్ తేజ్‌పాల్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రెండు వారాల్లోగా సంబంధిత కోర్టు లేదా పోలీసుల ఎదుట లొంగిపోవాలని (Surrender), దానికి సంబంధించిన ధృవీకరణ పత్రాన్ని కోర్టుకు సమర్పించాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

ఈ కేసులో తరుణ్ తేజ్‌పాల్‌ను దోషిగా నిర్ధారిస్తూ బాంబే హైకోర్టు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ ఆయన సుప్రీంకోర్టులో అప్పీల్ పిటిషన్ దాఖలు చేశారు.
జస్టిస్ అలోక్ అరధే నేతృత్వంలోని ధర్మాసనం ఈ అప్పీలును సెప్టెంబర్ 22న విచారణకు స్వీకరించేందుకు అంగీకరించింది. అయితే, విచారణ ప్రారంభమయ్యేలోపే ఆయన లొంగిపోయినట్లు ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలని షరతు విధించింది.

అప్పీల్ విచారణకు వచ్చే వరకు లొంగిపోవడం నుంచి తనకు మినహాయింపు (Exemption) ఇవ్వాలని తేజ్‌పాల్ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం తరుణ్ తేజ్‌పాల్ నిర్దేశిత రెండు వారాల వ్యవధిలో లొంగిపోవాల్సిందేనని స్పష్టమవుతోంది.