తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
హైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాలతో పాటు రాయలసీమ ప్రాంతాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తెలంగాణలో ఎల్లో అలర్ట్
ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల పరిధిలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం.
భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.