BREAKING
Osmania University: ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ అడ్మిషన్లు.. 648 సీట్లకు దరఖాస్తుల ఆహ్వానం! జైలు నుంచి వీడియో కాల్ ఎలా? మహిళా అధికారిపై వైరల్ వీడియో దుమారం! 'తెహెల్కా' మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌కు షాక్ మరో ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ పార్టీ లైన్ దాటితే రేవంత్ రెడ్డిని అయినా ఉపేక్షించం సిట్టింగ్ జడ్జితో విచారణకు హరీష్ రావు డిమాండ్ దేవాదుల ఎత్తిపోతల పథకంపై నేడు మంత్రి ఉత్తమ్ సమీక్ష కర్నూలులో ఖాకీల ఇళ్లలోనే కాలా నైట్ తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఒకే ఘటనతో పలు కేసులు.. భయపడేది లేదు: అంబటి రాంబాబు క్యూఆర్ పరిధిలో నేడే 'ఇందిరమ్మ ఇళ్ల' అర్హుల తుది జాబితా విడుదల గచ్చిబౌలిలో ప్రమాదకర భవనాల కూల్చివేత ఏపీలో ఇన్‌సర్వీస్ టీచర్లకు ప్రత్యేక టెట్ స్నాప్ చాట్ లో పరిచయం ఆమెకు జరిగింది ఆర్ధిక మోసం శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య

గచ్చిబౌలిలో ప్రమాదకర భవనాల కూల్చివేత

Select Suryaa Now
గచ్చిబౌలిలో ప్రమాదకర భవనాల కూల్చివేత

హైదరాబాద్: గచ్చిబౌలి అంజయ్య నగర్‌లో ఇటీవల భవనం కూలిన ఘటనను తీవ్రంగా పరిగణించిన అధికారులు.. ఆ సమీపంలో ప్రమాదకరంగా ఉన్న మరికొన్ని భవనాల కూల్చివేత ప్రక్రియను ఆదివారం సాయంత్రం వేగవంతం చేశారు.

వరద కాలువను (నాలా) ఆక్రమించి నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టినట్లు ప్రాథమికంగా తేలింది. అనుమతులకు మించి ఏడు నుంచి ఎనిమిది అంతస్తుల వరకు నిర్మించడంతో భవనం పునాదుల పటిష్టత దెబ్బతిన్నట్లు హైడ్రా (HYDRAA) కమిషనర్ ఏవీ రంగనాథ్ వెల్లడించారు.

ఈ ప్రమాదంలో మరణించిన నిరుపేద కూలీల కుటుంబాలను ప్రభుత్వం సత్వరమే ఆదుకోవాలని, తగిన పరిహారం అందించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా, నిబంధనలు ఉల్లంఘించి అక్రమ నిర్మాణానికి పాల్పడిన భవన నిర్మాణదారుడు (బిల్డర్) సయ్యద్ సాజిద్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు, అతడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.