దేవాదుల ఎత్తిపోతల పథకంపై నేడు మంత్రి ఉత్తమ్ సమీక్ష
హైదరాబాద్: దేవాదుల ఎత్తిపోతల పథకం పురోగతిపై తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేయడమే లక్ష్యంగా అధికారులతో ఆయన వివరంగా చర్చించనున్నారు.
ప్యాకేజీల వారీగా ప్రాజెక్టు భౌతిక (ఫిజికల్), ఆర్థిక పురోగతిపై అధికారులు మంత్రికి సమగ్ర నివేదికను వివరించనున్నారు. ప్రాజెక్ట్ పూర్తవ్వడానికి ప్రధాన ఆటంకంగా మారిన భూసేకరణ సమస్యల పరిష్కారంపై మంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు.
సాంకేతిక, పరిపాలనాపరమైన సమస్యలను త్వరితగతిన పూర్తి చేసి, మిగిలిన పనులను యుద్ధప్రాతిపదికన ముందుకు తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించనున్నారు. ఈ సమీక్షా సమావేశం ద్వారా దేవాదుల ప్రాజెక్టు పనుల్లో స్పష్టమైన పురోగతి వస్తుందని భావిస్తున్నారు.