మండలంలో ఘనంగా వన మహోత్సవ కార్యక్రమం.
మండలంలో ఘనంగా వన మహోత్సవ కార్యక్రమం.
దుమ్ముగూడెం సూర్య మేజర్ న్యూస్::
మండలంలోని వన మహోత్సవ కార్యక్రమం పలు శాఖల అధికారులు ఘనంగా నిర్వహించారు. ఎంపీడీవో ఆదేశాల మేరకు 37 పంచాయతీల్లో కార్యక్రమాన్ని నిర్వహించగా దుమ్ముగూడెం ప్రభుత్వ కాలేజీల్లో ప్రిన్సిపల్ కృష్ణవేణి,ఎఫ్ఆర్ఓ కమల, నారాయణరావుపేట ఆశ్రమ పాఠశాలలో సర్పంచ్ ఆదినారాయణ, డిఆర్ఓ అరుణ, నర్సాపురం ప్రాథమిక కేంద్రంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ సైదులు పిహెచ్ఈ డాక్టర్ పావని రెడ్డి, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో వివేక్ రామ్ తదితరు శాఖల అధికారులు వన మహోత్సవ కార్యక్రమంలో మొక్కలు నాటారు. సందర్భంగా వారు మాట్లాడుతూ..ప్రతి ఒక్కరూ వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటాలని మొక్కలు నాటడమే కాకుండా వాటి రక్షణ బాధ్యతగా కూడా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ సుజాత, ఎఫ్ ఎస్ ఓ ఆదినారాయణ, ఖలీద్, ఉపాధ్యాయులు సర్వేసరావు దొర, శ్రీనివాసరావు, ఎఫ్బి వోలు, గ్రామపంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.