BREAKING
బీజింగ్‌లో 25వ ప్రత్యేక ప్రతినిధుల సమావేశం న్యూఢిల్లీలో ఘనంగా జాతీయ షిప్పింగ్ బోర్డ్ తొలి 'సాగర్ సంవాద్' హోర్ముజ్ జలసంధిలో మందుపాతరలు తొలగించాం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ప్రపంచ బ్యాడ్మింటన్ కాంస్య పతక విజేతలు గాయత్రి - త్రిసా జాలీ ‘ఆపరేషన్ సింధూర్’ విజయం వెనుక స్పష్టమైన వ్యూహం తప్పులతడకగా స్మార్ట్ రేషన్ కార్డులు కంటతడి పెట్టిస్తున్న ఎరువుల కొరత మండలంలో ఘనంగా వన మహోత్సవ కార్యక్రమం. కంగనా-తాప్సీ వివాదం ఎప్పుడు ముగుస్తుంది? తాప్సీ క్లారిటీ.. మీడియాపైనే అసహనం Toxic Movie: టాక్సిక్ సినిమా ఫస్ట్ రివ్యూ.. రోడ్డు దుమ్మును తగ్గించి, వాయు నాణ్యతను మెరుగుపరచేందుకు వర్క్‌షాప్ పాలు, పనీర్‌ ప్యాకెట్‌ ఉబ్బిందా? ఎక్స్‌పైరీ చూడటం సరిపోదు.. ఈ విషయం తెలుసుకోండి! మొక్కలు నాటుదాం... పర్యావరణం కాపాడుదాం... కృతి సనన్‌ ఘాటు కౌంటర్‌.. ‘సంస్కృతి గుండెల్లో ఉంటుంది.. దుస్తుల్లో కాదు’ Osmania University: ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ అడ్మిషన్లు.. 648 సీట్లకు దరఖాస్తుల ఆహ్వానం!

‘ఆపరేషన్ సింధూర్’ విజయం వెనుక స్పష్టమైన వ్యూహం

Select Suryaa Now
‘ఆపరేషన్ సింధూర్’ విజయం వెనుక స్పష్టమైన వ్యూహం

మాజీ CDS అనిల్ చౌహాన్
న్యూఢిల్లీ: భారత సైన్యం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ సాధించిన చారిత్రాత్మక విజయం వెనుక మెరుగైన యుద్ధతంత్ర సాంకేతికత, స్పష్టమైన రాజకీయ మార్గదర్శకత్వం కీలక పాత్ర పోషించాయని మాజీ త్రివిధ దళాలధిపతి (CDS) జనరల్ అనిల్ చౌహాన్ వెల్లడించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆపరేషన్ సింధూర్ కార్యాచరణ వివరాలను ఆయన పంచుకున్నారు.

ఈ ఆపరేషన్ విజయానికి గల కారణాలను వివరిస్తూ.. "భారతదేశ విజయానికి ప్రధానంగా మెరుగైన పరిస్థితి అవగాహన, యుద్దభూమిపై పారదర్శకత ఎంతగానో తోడ్పడ్డాయి. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ — ఈ మూడు దళాల మధ్య సమాచార వ్యవస్థ (నెట్‌వర్కింగ్) అత్యంత బలంగా పనిచేసింది. యుద్ధభూమిలోని తాజా పరిస్థితులు ముప్పై దళాలకు ఒకే విధంగా అందుబాటులో ఉండటంతో సరైన సమయంలో అత్యంత ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోగలిగాం" అని తెలిపారు.

విజయం వెనుక ఉన్న మరొక ముఖ్యమైన అంశాన్ని ప్రస్తావిస్తూ.. "రెండోది స్పష్టమైన రాజకీయ నిర్దేశం (పొలిటికల్ డైరెక్షన్). కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడం వల్లనే త్రివిధ దళాలు వ్యూహాత్మకంగా ఆపరేషన్లను ప్రణాళిక చేయడానికి, అమలు చేయడానికి పూర్తి స్వేచ్ఛ లభించింది" అని పేర్కొన్నారు.

త్రివిధ దళాల మధ్య ఉన్న అద్భుతమైన సమన్వయం, నిర్ణయాధికారంలో లభించిన స్వేచ్ఛే ఈ ఆపరేషన్ గ్రాండ్ సక్సెస్ కావడానికి పునాదిగా నిలిచాయని ఆయన వ్యాఖ్యానించారు.