BREAKING
శాంతిభద్రతల పరిరక్షణే పోలీసుల ధ్యేయం.. ఎస్పీ రాహుల్ మీనా.. మున్సిపల్ ఎన్నికల్లో బ్రాహ్మణులకు ప్రాతినిధ్యం కల్పించాలి..:బ్రాహ్మణ పెద్దల సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం.. రైల్వే ట్రాక్ మార్గాన్ని పునఃపరిశీలించండి..:ఎమ్మెల్యే ఆనందరావుకు చాంబర్ ఆఫ్ కామర్స్ వినతి.. ముమ్మిడివరంలో 24వ రోజుకు చేరిన వీఆర్ఏల సమ్మె: స్పందించని ప్రభుత్వం.. మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వరంలో జాతీయ బాలిక దినోత్సవ వేడుకలు. దివంగత నేత జక్కంపూడి రామ్మోహనరావు వర్ధంతి 52 మంది లబ్ధిదారులకు హౌసింగ్ లోన్ మంజూరు.... ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు. లయన్స్ ఆధ్వర్యంలో పాత కళ్లజోళ్ల సేకరణ,: జిల్లా గవర్నర్ లయన్ చిట్నీడి శ్రీనివాసు పిలుపు! యువత స్వామి వివేకానందవారిని అదర్శముగా తీసుకోవాలి.. ఎం పి గంటి హరీష్ మాధుర్, ప్రపంచ టాప్ 2% శాస్త్రవేత్తల జాబితాలో ఆదిమూలంవారిపాలెం వాసి వైఎస్సార్‌సీపీ ‘గడప గడపకు’ కార్యక్రమం.. కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు ధ్వజం! ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు అంబాజీపేట విద్యార్థులు ఎంపిక: పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే నల్లమిల్లి. పోతవరం పంచాయతీలో వీబీజీ రామ్ అవగాహన ర్యాలీ - పాల్గొన్న శ్రామికులు, తనిఖీ బృందం పోలవరం ప్రాజెక్టును సందర్శించిన కానూరు హైస్కూల్ విద్యార్థులు

కృతి సనన్‌ ఘాటు కౌంటర్‌.. ‘సంస్కృతి గుండెల్లో ఉంటుంది.. దుస్తుల్లో కాదు’

Select Suryaa Now
కృతి సనన్‌ ఘాటు కౌంటర్‌.. ‘సంస్కృతి గుండెల్లో ఉంటుంది.. దుస్తుల్లో కాదు’

రక్షాబంధన్‌ సందర్భంగా ప్రముఖ ఆభరణాల సంస్థ GIVA రూపొందించిన ప్రకటనలో నటి కృతి సనన్‌ ధరించిన దుస్తులు సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. సంప్రదాయ పండగకు సంబంధించిన ప్రకటనలో ఆధునిక దుస్తులు ధరించడంపై కొందరు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈ విమర్శలపై కృతి సనన్‌ స్పందిస్తూ.. పండగల అసలు స్ఫూర్తిని దుస్తులతో ముడిపెట్టడం సరికాదని పేర్కొంది. రక్షాబంధన్‌ అనేది సోదరసోదరీమణుల మధ్య ప్రేమ, రక్షణ, ఆప్యాయతకు ప్రతీక అని తెలిపింది. తాను, తన సోదరి పరస్పరం రాఖీలు కట్టుకుంటామని.. ఒకరి ఆరోగ్యం, సంతోషం, దీర్ఘాయుష్షు కోసం మరొకరు ప్రార్థించుకుంటామని వెల్లడించింది.

మహిళలు ధరించే దుస్తులను బట్టి వారి సంస్కృతి, సంప్రదాయాల పట్ల గౌరవాన్ని నిర్ణయించకూడదని కృతి స్పష్టం చేసింది. కాలానుగుణంగా దుస్తుల ఫ్యాషన్‌లో మార్పులు సహజమేనని పేర్కొంటూ.. ‘సంస్కృతి, సంప్రదాయాలు మహిళ హృదయంలో ఉంటాయి.. ఆమె దుస్తుల నెక్‌లైన్‌లో కాదు’ అంటూ ఘాటుగా స్పందించింది.

కృతి వ్యాఖ్యలపై నటి, ఎంపీ కంగనా రనౌత్‌ కూడా స్పందించింది. మహిళలకు తమకు నచ్చిన దుస్తులు ధరించే స్వేచ్ఛ ఉన్నప్పటికీ.. కొన్ని పరిమితులను పాటించడం అవసరమని ఆమె అభిప్రాయపడింది