మొక్కలు నాటుదాం... పర్యావరణం కాపాడుదాం...
మొక్కలు నాటుదాం...
పర్యావరణం కాపాడుదాం...
బూర్గంపాడు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ మందా నాగరాజు
బూర్గంపాడు సూర్య (మేజర్ న్యూస్ )
పర్యావరణాన్ని కాపాడుకోవడం... సమతు ల్యాన్ని పాటించడం.. మొక్కలు నాటడంతోనే సాధ్యమవుతుందని బూర్గంపాడు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ మందా నాగరాజు అన్నారు. మంగళవారం మండల కేంద్రమైన బూర్గంపాడు లోని ప్రభుత్వ ఆసుపత్రిలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్క లు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్ర మానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సర్పంచ్ మందా నాగరాజు మొక్కల నాటి మాట్లాడారు.
మొక్కలను నాటడం వల్ల మనకు స్వచ్ఛమైన ఆక్సిజన్ లభిస్తుందని, పర్యావరణం పరిరక్షిం చబడుతుందని ఆయన అన్నారు. మొక్కల వల్ల ముఖ్యమైన ఆక్సిజన్ స్వచ్ఛమైన గాలి లభిస్తుందని ఆయన అన్నారు.మొక్కలు మనకు ప్రాణాధారమైన ఆక్సిజన్‌ను అందిస్తా యని, పచ్చని మొక్కలను చూడటం వల్ల మన ఒత్తిడి తగ్గి, మానసిక ప్రశాంతత లభిస్తుందని ఆయన అన్నారు.పర్యావరణాన్ని కాపాడుకుం
టూ మనం చూడని నీడ కోసం చెట్లను నాటడ మే జీవితానికి నిజమైన అర్థమని ఆయన పేర్కొన్నారు.ఒక మొక్కను నాటడం అంటే రేపటి మీద నమ్మకం ఉంచడం వంటిదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ గుర్రం ప్రసాద్, గ్రామ ఉపసర్పంచ్ గుండె వెంకన్న, ఈఓ సంపత్ శ్రీని వాస్, వార్డ్ మెంబర్లు, పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.