జనగామ జిల్లాలో శిశు మహిళా సమృద్ధి యాప్ ను రద్దు చేయాలని కోరుతూ ప్రజాభవన్ లో వినతి
అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జయలక్ష్మి
జనగామ జిల్లాలో జిల్లా కలెక్టర్ ఐసిడిఎస్ లో కొత్త రకమైన శిశు మహిళా సమృద్ధియాపురం తీసుకువచ్చి అంగన్వాడి టీచర్లను వెల్ఫేర్లను ఇబ్బందుల గురిచేస్తున్నారని కావున అంగన్వాడీలకు పనిభారం పెంచే కొత్త రకమైన యాప్ రద్దు చేయాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జయలక్ష్మి ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం రోజున హైదరాబాదులోని ప్రజా భవన్ లో జనగామ జిల్లా కలెక్టర్ తీసుకువచ్చిన శిశు మహిళా సమృద్ధి యాప్ ను రద్దు చేయాలని కోరుతూ ప్రజా భవన్ లోని ప్రజావాణి చైర్మన్ చిన్నారెడ్డి గారికి అంగన్వాడి టీచర్ అండ్ హెల్పర్స్ వర్కర్స్ యూనియన్( సిఐటియు) జనగామ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జయలక్ష్మి మాట్లాడుతూ
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి లేకుండా జనగామ జిల్లా కలెక్టర్ గారు తేదీ 20-08-2026 న ఐసీడీస్ లో కొత్త యాప్ ను శిశు మహిళ సమృద్ధి యాప్ ను తీసుకురావడం సరైంది కాదని అన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎన్ హెచ్ టి ఎస్ కేంద్ర ప్రభుత్వం పోషన్ ట్రాకర్ యాప్ ల ద్వారా ఐసిడిఎస్ లోని అంగన్వాడి సేవలు అందిస్తున్నారని ఒకే రకమైన పనిని 3 యాప్ లలో చేయడం అంటే పని భారం పెరగడమేనని జిల్లా కలెక్టర్ కొత్త రకమైన యాప్ తీసుకొచ్చి అంగన్వాడి నిజాయితీని తప్పుపట్టే విధంగా అంగన్వాడీలను అవినీతిపరులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడన్నారు. ఈ యాప్,లో అనేక సమస్యలు అంగన్వాడీ ఉద్యోగులకు ఎదురవుతున్నాయి,ఇప్పటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు nhts, పోషణ్ ట్రాకర్ 2 యాప్ లను అంగన్వాడీ ఉద్యోగులకు ఇచ్చారు,ఈ యాప్ ల ద్వారా ఆన్లైన్ పని జరుగుతుంది. ఇప్పుడు జిల్లాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధం లేకుండా కొత్త యాప్ ను జిల్లా కలెక్టర్ గారు తీసుకు రావడం సరైంది కాదు.దీనివల్ల పని భారం పెరగడంతో పాటు ఇట్టి పనితో పాటు అదనపు పని భారం పడే ప్రమాదం ఉందన్నారు
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఐసిడిఎస్ లో తీసుకువచ్చిన NHTS, పోషన్ ట్రాకర్ యాప్ ల ద్వారా అలాగే FRS ద్వారా ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని గర్భిణీ బాలింతలకు పిల్లలకు అందిస్తూ గర్భిణీ బాలింతలకు నిరంతరం అనేక సలహాలు సూచనలు చేస్తున్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్న అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అవగాహన కల్పిస్తూ blo, sir లాంటి అదనపు డ్యూటీ లు చేస్తు అంగన్వాడి కేంద్రంలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అందుబాటులో ఉండి పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పుతూ విధులు నిర్వహిస్తున్నారు. అలాగే ప్రతినెల చివరి వారంలో సెక్టార్ మీటింగ్ లలో పాల్గొంటూ ఫుడ్ కు సంబంధించిన రికార్డులను సమర్పిస్తున్నారు. ఇంకా తదితర రిపోర్టులను రిజిస్టర్లను రాస్తూ మరియు ప్రతిరోజూ నిరంతరం nhts పోషణ్ ట్రాకర్ యాప్ లలో ఆన్లైన్లో కూడా నిర్వహిస్తున్నారన్నారు. తీసుకువచ్చిన యాప్ వల్ల కూడా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే జిల్లాలో సుమారు 187 టీచర్స్, ఆయా పోస్టులు కాళిగా ఉన్నాయి. మరుగుదొడ్ల సౌకర్యం సరిగా లేక అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వంట పాత్రలు సరిగా లేక సొంత డబ్బులతోనే వంట పాత్రలు తెచ్చి పిల్లలకు ఆహారాన్ని వండి పెడుతున్న పరిస్థితి ఉన్నది. అంగన్వాడీ సెంటర్లలో మౌలిక వసతులైన మంచినీరు కరెంటు సౌకర్యం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. సెంటర్లలో బీరువాలు ఫర్నిచర్లు అందుబాటులో లేక రికార్డులు వంట సామాగ్రి భద్రపరచుకోవడానికి అనేక ఇబ్బందులు పెడుతున్నారు. సంవత్సరాల తరబడి వంట గ్యాస్ బిల్లులు కూరగాయల బిల్లులు అద్దె భవనాల పెండింగ్ బిల్లులు రావట్లేదు.టిఏ డిఏ ల వూసే లేకుండా పోయింది. అంగన్వాడి కేంద్రాలకు ప్రహరి గోడ లేక సెక్యూరిటీ లేకుండా పోయింది. ఇంకా అనేక ఇబ్బందులు అంగన్వాడి సెంటర్లలో ఉన్నాయి.
కొత్త యాప్ వల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. యాప్ ప్రారంభించిన తర్వాత గర్భిణీ బాలింతలకు పిల్లలకు ఫుడ్ పెట్టిన ఫోటో తీసి అప్లోడ్ చేసే సందర్భంలో ఫోటోలు ఎగిరిపోతున్నాయి. అప్పటికే గర్భిణీ బాలింతలు వెళ్లిపోతున్నారు. దానివల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రారంభ నిలువలు ఏ రోజు కారోజు ఖర్చులు వివరాలు అప్లోడ్ చేసే సందర్భంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి అత్యవసర పరిస్థితులలో సెలవు పెట్టుకునే అవకాశాలు లేకుండా ఇబ్బందులు జరిగే అవకాశాలున్నాయి. కావున ఒకే రకమైన పనిని 3 యాప్ లలో(NHTS, పోషన్ ట్రాకర్,శిశు మహిళ సమృద్ధి) చేయడం వల్ల సెల్ ఫోను నెట్వర్క్ సిగ్నల్స్ సహకరించక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వినతి పత్రం అనంతరం ప్రజాపాలన చైర్మన్ చిన్నారెడ్డి జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేసి కొత్తగా తెచ్చిన యాప్ ను రద్దు చేయాలని కలెక్టర్ కు చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ గారు సమాధానం ఇస్తూ నా వద్దకు పంపండి చర్చించి నిర్ణయం తీసుకుంటానని బదులిచ్చారు. అనంతరం ఐసిడిఎస్ డైరెక్టర్ ఆఫీసులో జాయింట్ డైరెక్టర్ మోతి మేడం కు ప్రజావాణి అధికారులు వినతి పత్రంలో రాసిన పత్రాన్ని అందించాము. మోతి మేడం స్పందిస్తూ ఈ మధ్యనే మా దృష్టిలో కూడా వచ్చిందని కలెక్టర్ గారితో మాట్లాడతానని ఐసిడిఎస్ డైరెక్టర్ ఆఫీస్ నుండి ఈ యాప్ కు మేము ఎలాంటి రాతపూర్వకమైన హామీ ఇవ్వలేదని వారు తెలియజేశారు . ఐసిడిఎస్ డైరెక్టర్ మరియు ప్రిన్సిపల్ సెక్రెటరీ బాధ్యతలు వహిస్తున్న శృతి హోజ గారికి కలిసి ప్రజావాణి అధికారులు రాసిన వినతిపత్రాన్ని అందించి యాప్ ను రద్దు చేయాలని కోరారు.వారు స్పందించి జనగాం జిల్లా కలెక్టర్ తో మాట్లాడి మీ సమస్యను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారూ ఈ వినతి పత్రం కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు సుంచు విజేందర్ యూనియన్ జిల్లా కార్యదర్శి బైరగోని అంజూమ్, జిల్లా ఉపాధ్యక్షులు పి బిక్షం, కొమ్ము మంగ, జి అమరావతి, సహాయ కార్యదర్శి ఎర్రబెల్లి సంతోష,బి శోభ,గంధమల్ల,జ్యోతి జిల్లా కమిటీ సభ్యులు,కొంగరి,ఇందిరా,సుమతి, బత్తిని శ్రావణి,కోమల,అరుణ,రజిత,రేణుక,మల్లిక, సుకన్య,రజిత,సుజాత,స్వర్ణ,లక్ష్మీ నర్సమ్మ,మానస, అపర్ణ,యాకమ్మ,, ఎలేంద్ర.