BREAKING
గండక్ నదిలో పెరుగుతున్న నీటిమట్టం: బీహార్‌లో హైఅలర్ట్! హైదరాబాద్‌లో 12 మంది నకిలీ డాక్టర్ల అరెస్ట్ మేడారం దేవస్థానానికి రూ. 5 లక్షల కరెంట్‌ బిల్లు షాక్‌! హెలికాప్టర్ ఇంజన్ 'అరవల్లి' తయారీకి హెచ్‌ఏఎల్-సాఫ్రాన్ చారిత్రాత్మక ఒప్పందం రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై మండిపడ్డ బీజేపీ ఎంపీ బాన్సురీ స్వరాజ్ ఇరుముడి సినిమా ప్రదర్శన నిలిపివేత కూతురి వ్యాఖ్యలతో మాకేంటి సంబంధం నేపాల్‌లో ఆకస్మిక వరదల విధ్వంసం యుఎన్ కమిటీ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్ ఉల్లి, చక్కెర ధరలు పెరిగితే NAFED నుండి సేకరణ 200 రోజుల తర్వాత థాయిలాండ్‌కు అమెరికా యుద్ధనౌక 'లింకన్' జనగామ జిల్లాలో శిశు మహిళా సమృద్ధి యాప్ ను రద్దు చేయాలని కోరుతూ ప్రజాభవన్ లో వినతి మై భారత్ వాలంటీర్ల నియామకం: దరఖాస్తు గడువు పొడిగింపు.. నెలకు రూ.5 వేల గౌరవ వేతనం ‘ఇరుముడి’ చూసి ఎమోషనల్ అయిన రష్మిక.. రవితేజ సినిమా తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం తెచ్చిందన్న విజయ్ దేవరకొండ! ఏపీ డిగ్రీ ప్రవేశాలు 2026: ముగింపు దశకు కౌన్సెలింగ్.. ఆగస్టు 27తో వెబ్ ఆప్షన్ల గడువు పూర్తి!

కూతురి వ్యాఖ్యలతో మాకేంటి సంబంధం

Select Suryaa Now
కూతురి వ్యాఖ్యలతో మాకేంటి సంబంధం

కొండా మురళీ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: తమ కుమార్తె చేసిన వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని, కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టే ప్రసక్తే లేదని కాంగ్రెస్ నాయకుడు కొండా మురళీ స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

అధినేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీల నాయకత్వంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, తాము కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతామని తేల్చి చెప్పారు. తమ కుమార్తె (కొండా సుస్మిత) చేసిన వ్యాఖ్యలకు, తమకు ఎలాంటి సంబంధం లేదని ఆయన విస్పష్టంగా ప్రకటించారు. పార్టీ క్రమశిక్షణా కమిటీ ఈ అంశంపై నిర్ణయం వెలువరించే వరకు తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని కొండా మురళీ స్పష్టం చేశారు.