BREAKING
గండక్ నదిలో పెరుగుతున్న నీటిమట్టం: బీహార్‌లో హైఅలర్ట్! హైదరాబాద్‌లో 12 మంది నకిలీ డాక్టర్ల అరెస్ట్ మేడారం దేవస్థానానికి రూ. 5 లక్షల కరెంట్‌ బిల్లు షాక్‌! హెలికాప్టర్ ఇంజన్ 'అరవల్లి' తయారీకి హెచ్‌ఏఎల్-సాఫ్రాన్ చారిత్రాత్మక ఒప్పందం రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై మండిపడ్డ బీజేపీ ఎంపీ బాన్సురీ స్వరాజ్ ఇరుముడి సినిమా ప్రదర్శన నిలిపివేత కూతురి వ్యాఖ్యలతో మాకేంటి సంబంధం నేపాల్‌లో ఆకస్మిక వరదల విధ్వంసం యుఎన్ కమిటీ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్ ఉల్లి, చక్కెర ధరలు పెరిగితే NAFED నుండి సేకరణ 200 రోజుల తర్వాత థాయిలాండ్‌కు అమెరికా యుద్ధనౌక 'లింకన్' జనగామ జిల్లాలో శిశు మహిళా సమృద్ధి యాప్ ను రద్దు చేయాలని కోరుతూ ప్రజాభవన్ లో వినతి మై భారత్ వాలంటీర్ల నియామకం: దరఖాస్తు గడువు పొడిగింపు.. నెలకు రూ.5 వేల గౌరవ వేతనం ‘ఇరుముడి’ చూసి ఎమోషనల్ అయిన రష్మిక.. రవితేజ సినిమా తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం తెచ్చిందన్న విజయ్ దేవరకొండ! ఏపీ డిగ్రీ ప్రవేశాలు 2026: ముగింపు దశకు కౌన్సెలింగ్.. ఆగస్టు 27తో వెబ్ ఆప్షన్ల గడువు పూర్తి!

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై మండిపడ్డ బీజేపీ ఎంపీ బాన్సురీ స్వరాజ్

Select Suryaa Now
రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై మండిపడ్డ బీజేపీ ఎంపీ బాన్సురీ స్వరాజ్

న్యూఢిల్లీ: పుణెలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహించిన 'ఛత్రో కీ గూంజ్' కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ బాన్సురీ స్వరాజ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశంలో రాహుల్ గాంధీ కొత్త తప్పుడు కథనాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు.

'పితృస్వామ్యాన్ని కూల్చివేయడం' (Dismantling Patriarchy) అనే భావనను తాను సమర్థిస్తున్నానని, కానీ రాహుల్ గాంధీ ఆ నినాదాన్ని పుణె వేదికకే పరిమితం చేశారా అని బాన్సురీ స్వరాజ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలోనే రాజకీయ పితృస్వామ్యానికి ఆశ్రయం కల్పిస్తున్నారని విమర్శించారు. ఆగస్టు 22న తన పరిశోధనా బృందం వద్ద ఉన్న అరకొర సమాచారంతో రాహుల్ గాంధీ దేశ ఓటర్లను తప్పుదోవ  పట్టించే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు.

సోషల్ మీడియాలో చౌకబారు ప్రచారం కోసం మిత్రదేశమైన ఇటలీ మహిళా ప్రధానమంత్రిని (జార్జియా మలోని) ఉద్దేశించి చేసిన అసభ్యకరమైన జోక్‌లో రాహుల్ గాంధీ పాలుపంచుకున్నారని మండిపడ్డారు. కేవలం సంచలనం కోసమే రాహుల్ గాంధీ ఇటువంటి నిందలకు, చౌకబారు రాజకీయాలకు పాల్పడుతున్నారని బాన్సురీ స్వరాజ్ విమర్శించారు.