BREAKING
వైఎస్ జగన్‌కు మహిళా నేతల రాఖీలు.. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో రాఖీ పౌర్ణమి సందడి గండక్ నదిలో పెరుగుతున్న నీటిమట్టం: బీహార్‌లో హైఅలర్ట్! హైదరాబాద్‌లో 12 మంది నకిలీ డాక్టర్ల అరెస్ట్ మేడారం దేవస్థానానికి రూ. 5 లక్షల కరెంట్‌ బిల్లు షాక్‌! హెలికాప్టర్ ఇంజన్ 'అరవల్లి' తయారీకి హెచ్‌ఏఎల్-సాఫ్రాన్ చారిత్రాత్మక ఒప్పందం రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై మండిపడ్డ బీజేపీ ఎంపీ బాన్సురీ స్వరాజ్ ఇరుముడి సినిమా ప్రదర్శన నిలిపివేత కూతురి వ్యాఖ్యలతో మాకేంటి సంబంధం నేపాల్‌లో ఆకస్మిక వరదల విధ్వంసం యుఎన్ కమిటీ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్ ఉల్లి, చక్కెర ధరలు పెరిగితే NAFED నుండి సేకరణ 200 రోజుల తర్వాత థాయిలాండ్‌కు అమెరికా యుద్ధనౌక 'లింకన్' జనగామ జిల్లాలో శిశు మహిళా సమృద్ధి యాప్ ను రద్దు చేయాలని కోరుతూ ప్రజాభవన్ లో వినతి మై భారత్ వాలంటీర్ల నియామకం: దరఖాస్తు గడువు పొడిగింపు.. నెలకు రూ.5 వేల గౌరవ వేతనం ‘ఇరుముడి’ చూసి ఎమోషనల్ అయిన రష్మిక.. రవితేజ సినిమా తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం తెచ్చిందన్న విజయ్ దేవరకొండ!

గండక్ నదిలో పెరుగుతున్న నీటిమట్టం: బీహార్‌లో హైఅలర్ట్!

Select Suryaa Now
గండక్ నదిలో పెరుగుతున్న నీటిమట్టం: బీహార్‌లో హైఅలర్ట్!

పాట్నా: నేపాల్‌లోని గండక్ నది ఎగువ పరీవాహక ప్రాంతంలో ఉప్పొంగిన ఆకస్మిక వరదల కారణంగా బీహార్ ప్రభుత్వం తీవ్ర అప్రమత్తత ప్రకటించింది. నదిలో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగే ప్రమాదం ఉండటంతో పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

నేపాల్ సరిహద్దుల నుంచి వస్తున్న భారీ వరద నీటితో గండక్ నది పరివాహక జిల్లాల్లో ఆకస్మిక వరద ముప్పు పొంచి ఉందని విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, సహాయక బృందాలను సిద్ధంగా ఉంచడం వంటి అన్ని రక్షణ ఏర్పాట్లను పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఎప్పటికప్పుడు నీటిమట్టాలను పర్యవేక్షిస్తూ, జిల్లాల అధికారులతో సమన్వయం చేసుకునేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని రంగంలోకి దించారు.