BREAKING
వైఎస్ జగన్‌కు మహిళా నేతల రాఖీలు.. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో రాఖీ పౌర్ణమి సందడి గండక్ నదిలో పెరుగుతున్న నీటిమట్టం: బీహార్‌లో హైఅలర్ట్! హైదరాబాద్‌లో 12 మంది నకిలీ డాక్టర్ల అరెస్ట్ మేడారం దేవస్థానానికి రూ. 5 లక్షల కరెంట్‌ బిల్లు షాక్‌! హెలికాప్టర్ ఇంజన్ 'అరవల్లి' తయారీకి హెచ్‌ఏఎల్-సాఫ్రాన్ చారిత్రాత్మక ఒప్పందం రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై మండిపడ్డ బీజేపీ ఎంపీ బాన్సురీ స్వరాజ్ ఇరుముడి సినిమా ప్రదర్శన నిలిపివేత కూతురి వ్యాఖ్యలతో మాకేంటి సంబంధం నేపాల్‌లో ఆకస్మిక వరదల విధ్వంసం యుఎన్ కమిటీ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్ ఉల్లి, చక్కెర ధరలు పెరిగితే NAFED నుండి సేకరణ 200 రోజుల తర్వాత థాయిలాండ్‌కు అమెరికా యుద్ధనౌక 'లింకన్' జనగామ జిల్లాలో శిశు మహిళా సమృద్ధి యాప్ ను రద్దు చేయాలని కోరుతూ ప్రజాభవన్ లో వినతి మై భారత్ వాలంటీర్ల నియామకం: దరఖాస్తు గడువు పొడిగింపు.. నెలకు రూ.5 వేల గౌరవ వేతనం ‘ఇరుముడి’ చూసి ఎమోషనల్ అయిన రష్మిక.. రవితేజ సినిమా తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం తెచ్చిందన్న విజయ్ దేవరకొండ!

హైదరాబాద్‌లో 12 మంది నకిలీ డాక్టర్ల అరెస్ట్

Select Suryaa Now
హైదరాబాద్‌లో 12 మంది నకిలీ డాక్టర్ల అరెస్ట్

హైదరాబాద్: నగరంలో ఎలాంటి అర్హతలు లేకుండా చట్టవిరుద్ధంగా క్లినిక్‌లు నిర్వహిస్తున్న 12 మంది నకిలీ డాక్టర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్, సికింద్రాబాద్ జోన్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టి వీరిని అదుపులోకి తీసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ వెల్లడించారు.

ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ నకిలీ సర్టిఫికెట్లతో క్లినిక్‌లు నడుపుతున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు ఈ దాడులు నిర్వహించారు. అరెస్టయిన నకిలీ డాక్టర్ల వద్ద నుంచి పెద్ద ఎత్తున అక్రమ మందులు, సెలైన్ బాటిళ్లు, సర్జికల్ పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రజలు ఎలాంటి అర్హత లేని నకిలీ వైద్యులను నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని, అనధికారిక క్లినిక్‌ల సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని అధికారులు కోరారు.