BREAKING
మూసాపేట లేఅవుట్ ఈ-వేలానికి హైకోర్టు గ్రీన్‌సిగ్నల్.. స్టే ఉత్తర్వులు లేవు! సూప్‌లో బొద్దింకలు.. జిస్మత్ మండి రెస్టారెంట్‌పై చర్యలు రాజ్యాంగంపై విద్యార్థులకు అవగాహన అవసరం : ఆచార్య జి.నాగరాజు సైబరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్‌ మొబైల్ అంగన్‌వాడీ కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే గాంధీ భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిదీ: నాగార్జునరెడ్డి పీవి ధ్వయం జీవన రేఖలు పుస్తకావిష్కరణ పారిశుధ్య నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు తప్పవు *జీహెచ్‌ఎంసీ ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో విస్తృత తనిఖీలు రాజ్యాంగ హక్కులు, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ పిలుపు కాంగ్రెస్ 'సంవిధాన్ రక్షక్ మార్చ్' కు..ర్యాలీగా తరలిన 'మైనంపల్లి' రాజ్యాంగ సంస్థల స్వయంప్రతిపత్తిని దెబ్బతీస్తోంది : కోట నీలిమ సెంటర్ కోర్ట్ పికిల్‌బాల్ లీగ్ సీజన్-2  భాగస్వామిగా 'యూత్ ఫీడ్ ఫౌండేషన్ తెలుగు రాష్ట్రాల్లో సేల్స్ బీజ్ యాప్ ప్రారంభం పంజాగుట్ట జివికె వన్ వద్ద బాంబు స్క్వాడ్ తనిఖీలు ఆడపడుచులకు అండగా కళ్యాణ లక్ష్మి - 23 కుటుంబాల్లో ఆనందం

పెళ్లి వార్తలపై నటి స్నిగ్ధ క్లారిటీ.. ఆ వీడియోపై నిజం బయటపెట్టిన నూతన నటి!

Select Suryaa Now
పెళ్లి వార్తలపై నటి స్నిగ్ధ క్లారిటీ.. ఆ వీడియోపై నిజం బయటపెట్టిన నూతన నటి!

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: అలా మొదలైంది చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి, తనదైన ప్రత్యేకమైన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటి స్నిగ్ధ నయని తాజాగా తన పెళ్లి వార్తలపై స్పందించారు. సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించడంతో పాటు గాయనిగానూ పలు షోలలో పాల్గొన్న ఆమె, ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన తన వివాహ వీడియోపై వస్తున్న తప్పుడు ప్రచారానికి చెక్ పెట్టారు. ఒక మంచి సందేశం ఇచ్చే ఉద్దేశంతో సరదాగా చేసిన రీల్ వీడియోను చూసి, నిజంగానే తాను పెళ్లి చేసుకున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె కుండబద్దలు కొట్టారు.

తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో స్నిగ్ధ మాట్లాడుతూ, నేటి కాలంలో చిన్న చిన్న మనస్పర్థలకే జంటలు విడిపోతున్నారని, అలా మంచి ప్రేమను ఎవరూ కోల్పోకూడదనే ఉద్దేశంతోనే ఆ వీడియోను రూపొందించినట్లు స్పష్టం చేశారు. అయితే ఆ వీడియోలో తాను ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్లు నటించడంతో, బంధువులు సైతం ఫోన్లు చేసి పెళ్లి ఎప్పుడు చేసుకున్నావంటూ ఆశ్చర్యంగా అడగడం జరిగిందని ఆమె తెలిపారు. సమాజానికి ఒక మంచి ఆలోచన పంచాలని చేసిన ఆ వీడియోను కొందరు కావాలనే వివాదాస్పదం చేసి వైరల్ చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదే ఇంటర్వ్యూలో తనపై వస్తున్న ఇతర వ్యక్తిగత రూమర్స్ గురించి కూడా స్నిగ్ధ స్పష్టతనిచ్చారు. తనకు పీసీఓడీ సమస్య ఉందని, దాని వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి ముఖంపై అవాంచిత రోమాలు రావడం చాలా సహజమని ఆమె వివరించారు. చాలా మంది అమ్మాయిలు ఈ సమస్యను ఎదుర్కొంటారని, ఇది కేవలం ఆరోగ్యపరమైన విషయమేనని స్పష్టం చేశారు. ఇక భవిష్యత్తులో పెళ్లి గురించి మాట్లాడుతూ, తనకు తోడుగా ఉండే మంచి మనసున్న వ్యక్తి దొరికితే జెండర్‌తో సంబంధం లేకుండా ఎవరైనా సరే వివాహం చేసుకుంటానని, లేదంటే జీవితాంతం ఇలాగే సింగిల్‌గా ఉంటానని కుండబద్దలు కొట్టారు.