వికలాంగుల ప్రతిభను గుర్తించి వారి ప్రగతికి బాటలు వేస్తున్న చంద్రబాబు.
వైకల్యం శరీరానికే సృజనాత్మకత కు కాదు.
వినికిడి యంత్రాలను పంపిణీ చేసిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి.
సూర్య న్యూస్ దర్శి.
విభిన్న ప్రతిభావంతులను ఆదరించడం మన బాధ్యతని వారిలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. వికలాంగుల ప్రతిభను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుర్తించి వారి ప్రగతికి బాటలు వేస్తున్నాడని ఆమె అన్నారు. విన్న ప్రతిభావంతుల అభివృద్ధికై కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆదుకుంటున్న ఘనత టిడిపి ప్రభుత్వాన్ని దేనని డాక్టర్ లక్ష్మీ అన్నారు. నియోజకవర్గంలోని పలువురికి వినికిడి యంత్రాలను డాక్టర్ లక్ష్మి అందజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల సెక్రటరీ సందు వెంకట్రావు పూసల ఓబయ్య కూటమినేతలు పాల్గొన్నారు.