వేమూరు నియోజకవర్గంలో పర్యటించిన కాంగ్రెస్ నేతలు
కొల్లూరు, మేజర్ న్యూస్: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన అరటి, కంద ,పసుపు పంట పొలాలను పరిశీలించారు. కాంగ్రెస్ పార్టీ పర్యటన బృందానికి పొలాల రైతులు తమ గోడును వెళ్ళగక్కారు. తుఫాను పోయి వారాల గడుస్తున్న తమకు నష్టపరిహారం అందలేదని వారి దృష్టికి తెచ్చారు. వందల ఎకరాలు సాగుచేసిన అరటి, కంద రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించాలని మాజీ ఎమ్మెల్యే షేక్ మస్తావలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలు తప్ప రైతులు గోడు పట్టించుకోవడంలేదని ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వాo పై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఒకపక్క రైతులు రైతు కూలీలు సామాన్య ప్రజలు పెరిగిన ధరలకు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం వెంటనే ధరల నియంత్రణ కార్యక్రమాన్ని చేపట్టి ప్రజలను కాపాడాలని డిమాండ్ చేశారు.