వెల్దుర్తిలో జోరుగా M.P.T.C అభ్యర్థి ప్రచారం
వెల్దుర్తి (సూర్య ప్రతినిధి మేజర్ న్యూస్):వెల్దుర్తి - 1 M.P.T.C వార్డు జనసేన పార్టీ అభ్యర్థి నాయకల్లు బాబ్జి గడప గడపకూ తిరుగుతూ ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ఓటర్లను నేరుగా కలుసుకుంటూ తమ అభ్యర్థిత్వాన్ని బలపరచాలని కోరుతూ కరపత్రాలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎన్నికల్లో జనసేన పార్టీ గుర్తు అయిన ‘గాజు గ్లాస్’ పై అమూల్యమైన ఓటు వేసి, భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.వచ్చే నెల 05-11-2026 (గురువారం) నాడు ఉదయం 7:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు పోలింగ్ జరగనుందని, ప్రజలంతా బాధ్యతాయుతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
సూర్య ప్రతినిధి షేక్ దస్తు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం