BREAKING
పాపన్ పేట్ లో జనసురక్ష,అవగాహన సదస్సు కార్యక్రమం ఉపాధ్యాయ నియోజకవర్గాల ఓటరు జాబితా ప్రక్రియకు సవరించిన షెడ్యూల్ : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి పాపన్ పేట్ లో జనసురక్ష,అవగాహనసదస్సు కార్యక్రమం.… భారత్ - పాలస్తీనా ఫుట్‌బాల్ మ్యాచ్‌లో వివాదం.. భారత కెప్టెన్‌పై అనుచిత ప్రవర్తన, పాలస్తీనా ఆటగాడిపై తీవ్ర విమర్శలు ధోని రిటైర్మెంట్ తర్వాత ఐపీఎల్‌లో అరుదైన రికార్డుకు చేరువవుతున్న ఆ ముగ్గురు ఆటగాళ్లు ఎవరో తెలుసా? వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం వీధి కుక్కల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి రూ.1.50 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముహూర్తం ఖరారు.. తేదీ, వేదిక వివరాలు ప్రకటించిన బీసీసీఐ ప్రజా సమస్యల పరిష్కారంలో జర్నలిస్టుల పాత్ర కీలకం లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ నామినేషన్ల స్వీకరణ, ఆన్‌లైన్ నమోదుపై దిశానిర్దేశం పంచాయతీ ఎన్నికల ప్రక్రియపై అధికారులతో సమావేశం బాక్సాఫీస్ వద్ద మార్వెల్ సునామీ.. కేవలం 24 గంటల్లోనే పది కోట్ల పైచిలుకు అడ్వాన్స్ బుకింగ్స్ రాబట్టిన ‘అవెంచర్స్ డూమ్‌డే’ హరిహరసుతుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మేడ్చల్‌లో అదుపుతప్పి బోల్తాపడిన స్కూటీ.. స్థానికుల చొరవతో బాధితుడికి సకాలంలో వైద్యం

వీధి కుక్కల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి

Select Suryaa Now
వీధి కుక్కల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి

అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్ : 46వ డివిజన్ పరిధిలో వీధి కుక్కల సమస్యను పరిష్కరించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత మున్సిపల్ అధికారులను డివిజన్ కార్పొరేటర్ ఖాజా వలి షేక్ కోరారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డివిజన్ పరిధిలోని కోవూరు నగర్‌లో ఈరోజు ఉదయం నుంచే మున్సిపల్ అధికారులు, పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రజలకు ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.

అయితే, డివిజన్‌లో వీధి కుక్కల సమస్య ఇంకా పూర్తిస్థాయిలో పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి సమయాల్లో వీధి కుక్కలు చెత్తాచెదారాన్ని రోడ్లపై చెల్లాచెదురు చేస్తుండటంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయని తెలిపారు.

ముఖ్యంగా పాఠశాలలకు వెళ్లే చిన్నారులు, ఉదయం వాకింగ్‌కు వెళ్లే వృద్ధులు వీధి కుక్కల కారణంగా భయాందోళనలకు గురవుతున్నారని, ఈ సమస్య ప్రజలకు తీవ్ర ఇబ్బందిగా మారిందని పేర్కొన్నారు.

గతంలో చేపట్టిన చర్యల తరహాలోనే వీధి కుక్కల సమస్య నియంత్రణకు మరింత సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ప్రజల భద్రత, ఆరోగ్యమే తమకు మొదటి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.

వీధి కుక్కల నియంత్రణకు చట్టబద్ధమైన నిబంధనలు, జంతు సంక్షేమ మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకుని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కార్పొరేటర్ ఖాజా వలి షేక్ సంబంధిత అధికారులను కోరారు.

 

రిపోర్టర్ : మొయినుద్దీన్ అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్