BREAKING
పాపన్ పేట్ లో జనసురక్ష,అవగాహన సదస్సు కార్యక్రమం ఉపాధ్యాయ నియోజకవర్గాల ఓటరు జాబితా ప్రక్రియకు సవరించిన షెడ్యూల్ : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి పాపన్ పేట్ లో జనసురక్ష,అవగాహనసదస్సు కార్యక్రమం.… భారత్ - పాలస్తీనా ఫుట్‌బాల్ మ్యాచ్‌లో వివాదం.. భారత కెప్టెన్‌పై అనుచిత ప్రవర్తన, పాలస్తీనా ఆటగాడిపై తీవ్ర విమర్శలు ధోని రిటైర్మెంట్ తర్వాత ఐపీఎల్‌లో అరుదైన రికార్డుకు చేరువవుతున్న ఆ ముగ్గురు ఆటగాళ్లు ఎవరో తెలుసా? వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం వీధి కుక్కల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి రూ.1.50 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముహూర్తం ఖరారు.. తేదీ, వేదిక వివరాలు ప్రకటించిన బీసీసీఐ ప్రజా సమస్యల పరిష్కారంలో జర్నలిస్టుల పాత్ర కీలకం లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ నామినేషన్ల స్వీకరణ, ఆన్‌లైన్ నమోదుపై దిశానిర్దేశం పంచాయతీ ఎన్నికల ప్రక్రియపై అధికారులతో సమావేశం బాక్సాఫీస్ వద్ద మార్వెల్ సునామీ.. కేవలం 24 గంటల్లోనే పది కోట్ల పైచిలుకు అడ్వాన్స్ బుకింగ్స్ రాబట్టిన ‘అవెంచర్స్ డూమ్‌డే’ హరిహరసుతుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మేడ్చల్‌లో అదుపుతప్పి బోల్తాపడిన స్కూటీ.. స్థానికుల చొరవతో బాధితుడికి సకాలంలో వైద్యం

రూ.1.50 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పబ్లిక్ ప్రాసిక్యూటర్

Select Suryaa Now
రూ.1.50 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పబ్లిక్ ప్రాసిక్యూటర్

 సూర్య పెద్దపల్లి ప్రతినిధి: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరో అవినీతి అధికారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ డొంకెన రవీందర్ రూ.1.50 లక్షలు లంచం తీసుకుంటుండగా బుధవారం కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలోని అధికారులు పట్టుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. 2023లో ధర్మారం మండలం రచ్చపల్లిలో భూ వివాదానికి సంబంధించి జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందారు. ఈ ఘటనపై మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసు నమోదైంది. ఈ కేసు విచారణలో నిందితులకు అనుకూలంగా వ్యవహరించి వారికి లబ్ధి చేకూరుస్తానని పబ్లిక్ ప్రాసిక్యూటర్ రవీందర్ రూ.2 లక్షలు లంచంగా డిమాండ్ చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగా బుధవారం రూ.1.50 లక్షలు స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో దాడి చేసి పట్టుకున్నారు. ఈ ఘటనతో పెద్దపల్లి జిల్లాలో కలకలం రేగింది.