హరిహరసుతుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్
అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్ : అనంతపురం నగరంలోని శ్రీనగర్ కాలనీలో వెలసిన శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ హరిహరసుతుడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని పూజలు నిర్వహించారు. హరిహరసుతుడి నామస్మరణలు, అయ్యప్ప స్వామి శరణుఘోషతో ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. అయ్యప్ప స్వామి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆకాంక్షించారు.
రిపోర్టర్ : మొయినుద్దీన్ అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్.