BREAKING
పాపన్ పేట్ లో జనసురక్ష,అవగాహన సదస్సు కార్యక్రమం ఉపాధ్యాయ నియోజకవర్గాల ఓటరు జాబితా ప్రక్రియకు సవరించిన షెడ్యూల్ : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి పాపన్ పేట్ లో జనసురక్ష,అవగాహనసదస్సు కార్యక్రమం.… భారత్ - పాలస్తీనా ఫుట్‌బాల్ మ్యాచ్‌లో వివాదం.. భారత కెప్టెన్‌పై అనుచిత ప్రవర్తన, పాలస్తీనా ఆటగాడిపై తీవ్ర విమర్శలు ధోని రిటైర్మెంట్ తర్వాత ఐపీఎల్‌లో అరుదైన రికార్డుకు చేరువవుతున్న ఆ ముగ్గురు ఆటగాళ్లు ఎవరో తెలుసా? వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం వీధి కుక్కల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి రూ.1.50 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముహూర్తం ఖరారు.. తేదీ, వేదిక వివరాలు ప్రకటించిన బీసీసీఐ ప్రజా సమస్యల పరిష్కారంలో జర్నలిస్టుల పాత్ర కీలకం లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ నామినేషన్ల స్వీకరణ, ఆన్‌లైన్ నమోదుపై దిశానిర్దేశం పంచాయతీ ఎన్నికల ప్రక్రియపై అధికారులతో సమావేశం బాక్సాఫీస్ వద్ద మార్వెల్ సునామీ.. కేవలం 24 గంటల్లోనే పది కోట్ల పైచిలుకు అడ్వాన్స్ బుకింగ్స్ రాబట్టిన ‘అవెంచర్స్ డూమ్‌డే’ హరిహరసుతుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మేడ్చల్‌లో అదుపుతప్పి బోల్తాపడిన స్కూటీ.. స్థానికుల చొరవతో బాధితుడికి సకాలంలో వైద్యం

ప్రజా సమస్యల పరిష్కారంలో జర్నలిస్టుల పాత్ర కీలకం

Select Suryaa Now
ప్రజా సమస్యల పరిష్కారంలో జర్నలిస్టుల పాత్ర కీలకం

సూర్య, లక్షెట్టిపేట/ మంచిర్యాల జిల్లా ప్రతినిధి : ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తీసుకువస్తూ, వాటి పరిష్కారం కోసం ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా జర్నలిస్టులు పనిచేస్తున్నారని ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ముఖ్య సలహాదారు, మాజీ మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య, జిల్లా అధ్యక్షుడు కొత్త వెంకటేశ్వర్లు అన్నారు. సమాజ శ్రేయస్సు, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాత్రికేయులు నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు.

జాతీయ పత్రికా దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి స్థానిక ఆర్యవైశ్య భవన్‌లో జర్నలిస్ట్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో పనిచేస్తున్న సుమారు 30 మంది పాత్రికేయులను శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన నల్మాస్ కాంతయ్య, కొత్త వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. నేటి సమాజంలో జర్నలిస్టుల పాత్ర అత్యంత కీలకమైందని పేర్కొన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలులో ఎదురవుతున్న ఇబ్బందులు, సమాజంలో చోటుచేసుకుంటున్న అన్యాయాలను వార్తల రూపంలో వెలుగులోకి తీసుకువస్తూ సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో పాత్రికేయులు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. నిజాన్ని నిర్భయంగా ప్రజల ముందుంచుతూ సమాజ అభ్యున్నతికి తమ వంతు కృషి చేస్తున్న జర్నలిస్టుల సేవలు అభినందనీయమని తెలిపారు.

ప్రజల గొంతుకగా నిలుస్తూ, సామాన్యుల సమస్యలకు ప్రాధాన్యతనిస్తూ వార్తలు రాయడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి జర్నలిస్టులు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. పాత్రికేయులు వృత్తిపరమైన బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తూనే, తమ ఐక్యతను కాపాడుకోవాలని, జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం సంఘటితంగా ముందుకు సాగాలని సూచించారు.

పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు నరేందుల సాహితి మాట్లాడుతూ.. సమాజంలో ప్రతిరోజూ జరిగే సంఘటనలను ప్రజలకు చేరవేస్తూ, వాస్తవాలను వెలుగులోకి తీసుకువస్తున్న జర్నలిస్టుల సేవలు చిరస్మరణీయమని అన్నారు. ప్రజలకు నిజానిజాలను తెలియజేయడంలో పాత్రికేయుల బాధ్యత ఎంతో గొప్పదని, ఎండనకా, వాననకా ప్రజా సమస్యలపై స్పందిస్తూ సమాచారాన్ని అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. జర్నలిస్టులను గౌరవించడం, వారి సేవలను గుర్తించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని తెలిపారు.

ఐక్య వ్యాపార సంఘం అధ్యక్షుడు మైలారపు సుధాకర్ మాట్లాడుతూ..  సమాజంలో అన్యాయాలకు గురవుతున్న నిరుపేదలకు జర్నలిస్టులు అండగా నిలుస్తున్నారని అన్నారు. బాధితుల సమస్యలను వార్తల రూపంలో ప్రభుత్వ యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేయడం ద్వారా ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నారని తెలిపారు. ప్రజాస్వామ్యంలో పాత్రికేయుల పాత్రను విస్మరించలేమని, వారి సేవలను గుర్తిస్తూ సన్మాన కార్యక్రమం నిర్వహించడం సంతోషకరమని అన్నారు. ఆ తర్వాత స్థానిక ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బోనగిరి కుమార్ తో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ లు వారి అనుభవాన్ని, జర్నలిస్ట్ ల ప్రస్తుత పరిస్థితులను పంచుకున్నారు.

అనంతరం కార్యక్రమానికి హాజరైన జర్నలిస్టులందరినీ ఆర్యవైశ్య మహిళా సంఘం నాయకులు శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పాత్రికేయులు కార్యక్రమ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మహిళా సంఘం ప్రధాన కార్యదర్శి పల్లెర్ల ఆరతి, కోశాధికారి కాసం స్వప్న, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు చెట్ల రమేష్, ప్రధాన కార్యదర్శి నల్మాస్ శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఓజ్జల శ్రీనివాస్, కోశాధికారి నరేందుల రమేష్, మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గౌరిశెట్టి శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ కొంజర్ల ప్రసాద్, రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ పీఆర్వో కొంజర్ల శ్రీనివాస్, యువజన సంఘం అధ్యక్షుడు గడ్డం వికాస్, ప్రధాన కార్యదర్శి రంజిత్, జిల్లా యువజన సంఘం ప్రధాన కార్యదర్శి బొద్దుకూరి రాజ్ కుమార్, మహిళా సంఘం గౌరవ సలహాదారులు ఉత్తూరు రజిత, చెట్ల రమ్య తదితరులు పాల్గొన్నారు.