వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం
ఆత్మకూరు/ మేజర్ న్యూస్: వనపర్తి జిల్లా రేచింతల పిఎస్ఏఎస్ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రహమతుల్లా ప్రారంభించారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. దళారులకు మోసపోకుండా కొనుగోలు కేంద్రాన్ని వాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రేచింతల గ్రామ సర్పంచ్ ప్రశాంతి కిరణ్, పిఎసిఎస్ సీఈఓ రవికుమార్, డైరెక్టర్లు, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.
_రాజారత్నం, ఆత్మకూరు వనపర్తి జిల్లా.