BREAKING
లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ నామినేషన్ల స్వీకరణ, ఆన్‌లైన్ నమోదుపై దిశానిర్దేశం పంచాయతీ ఎన్నికల ప్రక్రియపై అధికారులతో సమావేశం బాక్సాఫీస్ వద్ద మార్వెల్ సునామీ.. కేవలం 24 గంటల్లోనే పది కోట్ల పైచిలుకు అడ్వాన్స్ బుకింగ్స్ రాబట్టిన ‘అవెంచర్స్ డూమ్‌డే’ హరిహరసుతుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మేడ్చల్‌లో అదుపుతప్పి బోల్తాపడిన స్కూటీ.. స్థానికుల చొరవతో బాధితుడికి సకాలంలో వైద్యం వినోద రంగంలో దారుణమైన పరిస్థితులు.. షూటింగ్ సెట్లో లైట్‌మెన్ మృతి చెందినా ఆపకుండా పనిచేయడంపై ప్రముఖ నటి సంచలన వ్యాఖ్యలు హాలీవుడ్‌లో సంచలనం.. తన ప్రొడక్షన్ కంపెనీని మళ్లీ వెనక్కి కొనుగోలు చేసిన ప్రముఖ నటి రీస్ విదర్‌స్పూన్ తాండూరులో కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్.. ఫ్లెక్సీల వివాదంతో రచ్చకెక్కిన అంతర్గత విభేదాలు గ్రీస్ వీధుల్లో మనవళ్లతో సూపర్ స్టార్ సందడి.. రజనీకాంత్ అరుదైన ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేసిన సౌందర్య కొత్త జేమ్స్ బాండ్ ఎంపికపై ఆసక్తికర నిజాలు బయటపెట్టిన జెఫ్ బెజోస్.. తొలుత రాబర్ట్ ప్యాటిన్సన్‌ను వద్దనుకోవడానికి అసలు కారణం ఇదే! దారుణమైన మోసం.. డబ్బులిచ్చి వీడియో తీసి వెనక్కి తీసుకున్నారు: బాలీవుడ్ నటుడి సంచలన వ్యాఖ్యలు తాండూరులో రాజకీయ దుమారం.. బీఆర్ఎస్ కౌన్సిలర్ జావిద్ ముందస్తు అరెస్ట్ నెగెటివిటీనే నాలో కసి పెంచుతుంది.. ట్రోల్స్‌పై స్పందించిన పాన్ ఇండియా హీరో దుల్కర్ సల్మాన్ అంతర్జాతీయ వెబ్‌సిరీస్‌లో ప్రముఖ బాలీవుడ్ నటుడు.. ఏఎం ఫార్స్టర్ క్లాసిక్ నవల ఆధారంగా అట్టహాసంగా ‘ఎ పాసేజ్ టు ఇండియా’ కౌన్సిలర్ అజయ్ కుమార్ జన్మదిన వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్లారెడ్డి

తాండూరులో కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్.. ఫ్లెక్సీల వివాదంతో రచ్చకెక్కిన అంతర్గత విభేదాలు

Select Suryaa Now
తాండూరులో కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్.. ఫ్లెక్సీల వివాదంతో రచ్చకెక్కిన అంతర్గత విభేదాలు

తాండూరు, మేజర్ న్యూస్: తాండూరు పట్టణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఎమ్మెల్యే పర్యటనకు ముందే కాంగ్రెస్ నాయకుల మధ్య ఫ్లెక్సీల వివాదం రాజకీయ వేడిని రాజేసింది. రాజీవ్ కాలనీలో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం నేపథ్యంలో కౌన్సిలర్లు బంటు వేణుగోపాల్, అల్లాపూర్ శ్రీకాంత్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వివాదానికి కేంద్రబిందువుగా మారాయి. సదరు ఫ్లెక్సీలలో మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్‌రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడి ఫొటోలు లేకపోవడంతో వాటిని తొలగించేందుకు చైర్‌పర్సన్ వర్గానికి చెందిన నాయకులు ప్రయత్నించినట్లు సమాచారం. మాజీ పట్టణ అధ్యక్షుడు హబీబ్ లాలా, కాంగ్రెస్ నాయకులు వసీం, బాతుల వెంకట్ తదితరులు ఫ్లెక్సీల తొలగింపునకు ప్రయత్నించినట్లు తెలిసింది. ఈ చర్యను కౌన్సిలర్ బంటు వేణుగోపాల్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ఫ్లెక్సీలు తొలగిస్తే సహించేది లేదని హెచ్చరించినట్లు సమాచారం. గతంలోనూ చైర్‌పర్సన్, పట్టణ అధ్యక్షుడి ఫొటోలు లేకుండానే పలుమార్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశామని, అప్పుడు అభ్యంతరం వ్యక్తం చేయని వారు ఇప్పుడు ఎందుకు వివాదం సృష్టిస్తున్నారని ప్రశ్నించినట్లు తెలిసింది. ఎమ్మెల్యే పర్యటన, శంకుస్థాపన కార్యక్రమానికి ముందే చోటుచేసుకున్న ఈ పరిణామం తాండూరు కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు మరోసారి రచ్చకెక్కాయనే చర్చకు తెరలేపింది. అధికార పార్టీలో నేతల మధ్య సమన్వయ లోపమా? లేక ఆధిపత్య పోరే ఈ వివాదానికి కారణమా? అన్నది పట్టణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.