కౌన్సిలర్ అజయ్ కుమార్ జన్మదిన వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్లారెడ్డి
శామీర్‌పేట, మేజర్ న్యూస్: మూడు చింతలపల్లి మున్సిపాలిటీ 22వ వార్డు కౌన్సిలర్ ఆది అజయ్ కుమార్ జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అజయ్ కుమార్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ప్రజలకు మరిన్ని సేవలు అందిస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అజయ్ కుమార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో అలియాబాద్ మున్సిపాలిటీ చైర్‌పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి, మూడు చింతలపల్లి మున్సిపాలిటీ చైర్మన్ జాం రవి, పలువురు కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.