BREAKING
కోటి రూపాయల గ్రంథాలయం.. నిర్వహణకు ఒక్కరే సిబ్బంది ఆపదలో ఆపన్నహస్తం.. బాధితుడికి అండగా డా.మహేందర్‌రెడ్డి! పొలం పనులకు వెళ్తున్న రైతుపై ఎలుగుబంటి దాడి. ఫ్రీహోల్డ్ భూముల సమస్యల పరిష్కార ప్రక్రియ, రీ–సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలి -జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ ఘనంగా జ్యువెల్ హైట్స్‌లో శ్రీ విజయ వినాయక గణపతి ఆలయ ప్రతిష్ఠాపన మహోత్సవం ఇందిరాగాంధీకి ఘన నివాళి దేశానికి ఇందిరా గాంధీ చేసిన సేవలు మరువలేనివి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా కె. సుధారాణి బాధ్యతల స్వీకరణ.. పుట్టినరోజు వేడుకల్లో చిన్నారులకు చేయూత పేద విద్యార్థినికి రూ.50 వేల ఆర్థిక సాయం అందించిన చైర్‌పర్సన్ గడ్డం అనన్య రుద్రపూర్‌లో 32 మందికి చేయూత పెన్షన్ల పంపిణీ పరిషత్ ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించిన సబ్ కలెక్టర్.. మరికాసేపట్లో ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్ కీలక భేటీ విద్యార్థులకు గ్రంథాలయ ప్రాముఖ్యతపై అవగాహన నికోల్స్ సెంచరీ..తొలి టెస్టు తొలిరోజు న్యూజిలాండ్ 243/5

దేశానికి ఇందిరా గాంధీ చేసిన సేవలు మరువలేనివి

Select Suryaa Now
దేశానికి ఇందిరా గాంధీ చేసిన సేవలు మరువలేనివి

కీసర, మేజర్ న్యూస్: భారత మాజీ ప్రధాని, ఉక్కు మహిళ స్వర్గీయ ఇందిరా గాంధీ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కాంగ్రెస్ నాయకులు కొనియాడారు. దేశ సమగ్రత, అభివృద్ధి, పేద ప్రజల సంక్షేమం కోసం ఆమె చేసిన కృషి భావితరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని కీసర డివిజన్‌లో కాంగ్రెస్ నాయకులు ఘనంగా వేడుకలు నిర్వహించి, ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కీసర డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షురాలు రామిడి స్వప్న విజయ్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు కర్రె బాలమణి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ.. ఇందిరా గాంధీ ధైర్యసాహసాలు, దృఢమైన నాయకత్వం దేశ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించాయని అన్నారు. బ్యాంకుల జాతీయీకరణ, హరిత విప్లవానికి ప్రోత్సాహం, పేదరిక నిర్మూలన లక్ష్యంగా చేపట్టిన కార్యక్రమాలు దేశ ఆర్థిక, సామాజిక రంగాలపై చెరగని ముద్ర వేశాయని గుర్తుచేశారు. దేశ ఐక్యత, సమగ్రత కోసం ఆమె చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, డివిజన్ ప్రధాన కార్యదర్శి తటాకం లక్ష్మణ్ శర్మ, శ్రీనివాస్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ సత్తిరెడ్డి, అధికార ప్రతినిధి జూపల్లి రవీందర్, కోశాధికారి రాజు గుప్తా, ఎస్సీ సెల్ అధ్యక్షుడు నవీన్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు ముద్దం వెంకటేష్ యాదవ్, కృష్ణారెడ్డి, బిక్షపతి, మాజీ అధ్యక్షులు వెంకటేష్ శర్మ, ముత్యాలు కృష్ణ, మైనార్టీ సెల్ అధ్యక్షుడు అన్వర్, మేడ్చల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ వేణు, సీనియర్ నాయకులు చిక్కుడు రమేష్, ఉమాపతి శర్మ, దయానంద్ గౌడ్, అల్లదుర్గం కృష్ణ, తటాకం అభిలాష్ శర్మ, హనుమంత్ రెడ్డి, రైతు విభాగం అధ్యక్షుడు కృష్ణారెడ్డి, సురేష్, మాజీ కీసరగుట్ట ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యుడు రెడ్డబోయిన ప్రవీణ్ ముదిరాజ్, పోశబోయిన రాజు యాదవ్, దొంతోజి వెంకటేష్ చారి, మచ్చని శ్రీశైలం యాదవ్, గండు వెంకటేష్ యాదవ్, చినింగని నరసింహ, దశరథ, శ్రీను తదితరులు పాల్గొన్నారు.