పుట్టినరోజు వేడుకల్లో చిన్నారులకు చేయూత
చేవెళ్ల: చేవెళ్ల మున్సిపాలిటీకి చెందిన అవుసుల ప్రవీణ్ చారి పుట్టినరోజు వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సేవాభావాన్ని చాటుకుంటూ ఇద్దరు చిన్నారుల చదువులకు చేయూత అందించారు.
తన పుట్టినరోజు సందర్భంగా చేవెళ్లకు చెందిన దివంగత విశ్వనాథ చారి కుమార్తెలు సహస్ర, మన్విత చదువుల నిమిత్తం రూ.25 వేల నగదును ఆర్థిక సహాయంగా అందజేశారు. అంతేకాకుండా చిన్నారులకు స్కూల్ బ్యాగులు, స్టేషనరీ సామగ్రిని అందజేశారు. పుట్టినరోజు వేడుకలను ఆడంబరాలకు పరిమితం చేయకుండా, పేద విద్యార్థుల చదువులకు సహాయం అందించడం పట్ల పలువురు ప్రశంసలు వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో చేవెళ్ల మున్సిపాలిటీ 11వ వార్డు కౌన్సిలర్ పైండ్ల మధు సూధన్ రెడ్డి, ఆవుసుల నవీన్ చారి, సీనియర్ పాత్రికేయులు వి. శ్రీనివాసచారి, ఆలంపల్లి రాజశేఖర్, ప్రవీణ్ చారి మిత్రులు జూకన్నగారి శ్రీనివాస్ రెడ్డి, వడ్ల శ్రీనివాస చారి, దేవర గౌతంరెడ్డి, మహమ్మద్ ఖాలీం తదితరులు పాల్గొన్నారు.
సున్నపు ప్రవీణ్ : చేవెళ్ల -మేజర్ న్యూస్